1. శ్రీధర్‌

సొంత ఇంటికల నెరవేరుతుందా? విదేశీయానం ఉందా? ఏ ఫేసింగ్‌ ఇల్లు తీసుకోవాలి?

మీరు 2020 అక్టోబర్‌ నుంచి ఇంటికోసం ప్రయత్నం చేసుకోవడం మంచిది. అప్పుడు మీ కల నెరవేరుతుంది. మీరు తూర్పు ఫేసింగ్‌ ఇల్లు తీసుకోవడం మంచిది. బెడ్‌రూంగా వాయువ్యం అయితే శ్రేష్ఠం. తూర్పు ఫేసింగ్‌ ఇల్లు అయితేనే ఇది సాధ్యం.

మీ జాతకంలో విదేశాలకు అవకాశం తక్కువగా ఉన్నది. అలాటిం ఆలోచనలను పెట్టుకోకండి.

2. పరశురాం

జాతకం ఎలా ఉంది? భవిష్యత్తు ఎలా ఉంది?

ప్రస్తుతం మీకు నడుస్తున్న దశ అంత అనుకూలమైనది కాదు. శని అంతర్దశ నడుస్తుంది. సమయం బాలేదు. అక్టోబర్‌ 2019 తర్వాత దశ మారుతుంది. అప్పినుంచి అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

దానం : నూనె / పల్లీలు, 2. అన్నదానం చేయడం మంచిది.

3. అరవింద్‌ కుమార్‌

నాకు ఇప్పివరకు వివాహం కాలేదు. ఎప్పుడు అవుతుంది?

మీకు 2020 ఫిబ్రవరి తర్వాత వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జాతకరీత్యా అధికంగా దానాలు జపం చేసుకుంటే మంచిది. ఇప్పినుంచి దాన జపాలు చేసుకుంటేనే 2020 ఫిబ్రవరి తర్వాత వివాహం అవుతుంది. లేకపోతే ఆ సమయంలో కూడా ఇబ్బందిపడతారు.

దానం : నిమ్మకాయ పులిహోర / అలంకర వస్తువులు, 2. గోధుమపిండి/ గోధుమరవ్వ, 3. పశుపక్షాదులకు ఆహారం/ 4. ఆకుకూరలు / గాయకూరలు/ , 5. కందిపప్పు / దానిమ్మపళ్ళు / కర్జూరాలు. ఈ 4 నంబర్‌లలో రాసినవి ప్రతీ ద్లాోంనుంచి ఒక్కొక్కి దానం తప్పనిసరిగా చేయాలి. ఉపయోగించుకునేవారికి.

 

జపం : కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ జపం నిరంతరం చేసుకోవాలి.

4. నాగదేవి

భవిష్యత్తు ఎలా ఉంది?

ప్రస్తుతం సమయం అనుకూలంగానే ఉన్నది. 2020 సెప్టెంబర్‌ వరకు. ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2020 నవంబర్‌ తర్వాత కొంచెం ఒత్తిడి ఉంటుంది.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ, శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

దానం : నూనె / పల్లీలు 2. కందిపప్పు / దానిమ్మపళ్ళు / కర్జూరాలు దానం చేయడం మంచిది.

5. విశ్వనాథ్‌

భవిష్యత్తు ఎలా ఉంది?

మీకు ప్రస్తుతం సమయం అనుకూలంగా లేదు. అన్ని పనులో నిరాశ నిస్పృహలు ఉంాయి. అన్నినీ కోల్పోవడం జరుగుతుంది. 2020 ప్రారంభం నుంచి బావుంటుంది.

దానాలు : అన్నదానం / పాలు / పెరుగు, 2. కూరగాయలు / ఆకుకూరలు, 3. ఇడ్లీ / వడ, 4. గోధుమపిండి / గోధుమరవ్వ / చపాతీలు దానం చేయడంమంచిది.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

6. సిద్దార్థ

ఉద్యోగంలో బదిలీ మరియు ప్రమోషన్‌ ఎప్పుడు వస్తాయి?

మీకు జులై 23 2019 నుంచి నవంబర్‌ 2019 వరకు సమయం అనుకూలంగా ఉన్నది. ఆ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఆ నాలుగు నెలల వ్యవధిలో మీకు అన్ని విధాలా మంచి గుర్తింపు వస్తుంది.

జపం  : శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.

దానం : కూరగాయలు / ఆకుకూరలు, 2. నిమ్మకాయ పులిహోర / అలంకరణ వస్తువులు, 3. పళ్ళు / విద్యార్థులకు పుస్తకాలు/ హోమాలకు ఆవునెయ్యి , 4. ఇడ్లీ / వడ / మినప సున్ని ఉండలు దానం చేయాలి. అధికంగా చేయాలి.