ముగ్గులు మన భారతీయ సంస్కృతిలో అతి ముఖ్యమైన సంప్రదాయం. ఉదయం ఇంటిముందు ముగ్గు కనిపిస్తే, వాకిలి పరిశుభ్రంగా కనిపించి మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. అష్టదళ పద్మం, పద్మం, ష్కోణాలు, గోవు అడుగులు, స్వస్తిక్‌, శంకు చక్రాలు, మారేడు దళం ఇలా రకరకాల ముగ్గులు దేవుని ముందు తులసి ముందు ఆయా సందర్భాలను బ్టి వేస్తారు. ఎవరైతే రోజూ విష్ణుమూర్తి ముందు అమ్మవారి ముందు రోజూ ముగ్గు పెడతారో వారికి సప్తజన్మల వరకు సౌభాగ్యం లభిస్తుందని మన శాస్త్రాలు చెపుతున్నాయి.

అయితే అన్నికన్నా మనకు ప్రత్యేకంగా ముగ్గుల పండుగలా కనిపించేది ధనుర్మాసం. ధనుస్సులో సూర్యుడు ప్రవేశించిన రోజు నుండి మరక సంక్రాంతివరకు నెలరోజులు రకరకాల ముగ్గులు ఇంటి ముందు పెడతారు.

ముగ్గులు మనం ఎందుకు పెడుతున్నాం? దీనికి వెనుక శాస్త్రీయత ఏమి? అని ఆలోచిస్తే మనకు ఎన్నో కారణాలు కనబడతాయి. ముగ్గులు బియ్యం పిండితో వేయాలి. అలా వేయడం వలన ఎన్నో క్రిమి కీటకాలు ఇంో్లకి రాకుండా అరికడుతుంది. చూడానికి అందంగా కింకి హాయిగా,  మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది.

 ముగ్గులు వేయడం కేవలం సంప్రదాయమేకాదు, అది ఇంటి ముందు అందానికి ఆలవాలము, ఈ ముగ్గులు స్త్రీల నైపుణ్యం, వారి కళాత్మక దృష్టిని చాటుతాయి. అంతేకాదు, ఎన్నో గీతలు, ఎన్నో చుక్కలు పెట్టి అన్నీ కలుపుతూ చక్కని ముగ్గును వేయడం వలన వేసేవాళ్ళ మేథస్సుకు పదును పెడుతున్నట్లుగా ఉంటుంది. ఎన్నో చిక్కుముడులను విప్పి సమస్యలను పరిష్కారం చేయగల నైపుణ్యం చురుకుతనం తెలివి తేటలు దీని వలన లభిస్తాయి. స్త్రీల నైపుణ్యానికి, మేథస్సుకు ఒక గుర్తింపును తెస్తున్నాయి. ప్రాతఃకాలంలో సూర్యరశ్మికి ఎదురుగా నిల్చుని ముగ్గులు వేయడం,  చలికాలం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంటి ముందు ముగ్గు ఉంటే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.

ముగ్గుల వెనుక ఉన్న అనేక కారణాలు.

ఆధ్యాత్మికంగా - మహాలక్ష్మికి ఆహ్వానం,  ధాన్యలక్ష్మికి ఆహ్వానం.

వ్యాయామపరంగా - తెల్లవారు ఝామున లేచి ముగ్గులు పెట్టడం వలన శరీరానికి వ్యాయామం.

సంప్రదాయపరంగా చూస్తే - మన సంస్కృతీ సంప్రదాయాలను తరతరాలుగా వ్యాపింప చేయడం. మెదడుకు ఇది మేత వంటిది.

ముగ్గులు వేయడంలో ఏలాటి కొలబద్దలు లేకుండా కొలతలతో వేసినట్లుగా అన్ని కోణాలు అన్ని వైపుల కచ్చితంగా ముగ్గుతో వేస్తారు. ఏ చుక్కనుండి ఏ చుక్కకు కలిపితే పద్మంలా అవుతుంది. ఏ గీత నుండి ఏ గీత వరకు కలిపితే కలశం అవుతుంది అని ఆలోచించి అరగంటలో వాకిల్లో అందమైన రంగు రంగుల రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఈ నైపుణ్యం మన భారతీయ మహిళలకు తప్ప మరెవ్వరికీ తేదని సగర్వంగా చెప్పుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో వేసే  డిజైన్‌లు వేసి వాటిలో రంగులు నింపడం కాదు. ఈ పండుగకు చుక్కలు లేదా గీతల ముగ్గులకు మాత్రమే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

ఏయే ముగ్గులు వాకిల్లో పెట్టకూడదు..?

చాలామంది ఇంటిముందు శివలింగాలు, లక్ష్మీ సరస్వతీ లాటిం దేవతల బొమ్మలు ముగ్గుపిండితో వేస్తుఉంటారు. ఆ తరువాత వాటిని తొక్కుతూ, దాటుతూ నడుస్తుఉంటారు. అది మహాదోషం. చాలామంది పెయిటిటింగ్‌తో ప్లారింగ్లో శివలింగాల ముగ్గును, దేవతల చిత్రాలు గీస్తుఉంటారు. చూడానికి బాగుంటా యి కాని వాటిని మనం దాటి నడుస్తూఉంటాం . చీపురుతో ఊడుస్తుఉంటాం . తొక్కుతుఉంటాం . అలా తొక్కే స్థలంలో అటువంటి ముగ్గులు వేయకూడదు. దేవునిముందు తులసికోటముందు అష్టదళ పద్మం గోవు పాదాలు, అచ్చులు, శంఖం, చక్రం వేయాలి. ప్రత్యేక పూజా సందర్భాల్లో సర్వతోభద్రను వేయాలి. ఇంటిముందు ఏ ముగ్గు వేసినా ముగ్గును గొబ్బిళ్ళను తొక్కకుండా జాగ్రత్త పడాలి.

మన పెద్దవారు చెప్పిన ప్రతీ ఆచారానికి సంప్రదాయానికి ఒక వైజ్ఞానికత ఉంటుంది. ఆ వైజ్ఞానికాంశాన్ని తెలుసుకొని మసలుకోవడం మంచిది.  ప్రస్తుత కాలాల్లో వచ్చే మార్పుల వల్ల అవి అన్నీ అంతరించుకుపోతున్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది.