జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశులకు చెందిన అత్తలు కోడళ్ల విషయంలో చాలా దారుణంగా ఉంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం... 

పెళ్లి అనగానే చాలా మంది అమ్మాయిలు భయపడిపోతారు. దాని కారణం... ఎలాంటి అత్తగారు వస్తారో అనేది ప్రధాన కారణం. ఈ మధ్య కాస్త అత్తలు మారారు కానీ....ఒకప్పుడు అత్తలు.. కోడళ్లను రాచి రంపాన పెట్టేవారు. భర్త మంచివాడైనా అత్త కారణంగా నరకం అనుభవించిన కోడళ్లు చాలా మందే ఉన్నారు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశులకు చెందిన అత్తలు కోడళ్ల విషయంలో చాలా దారుణంగా ఉంటారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

1.సింహ రాశి..
సింహ రాశి తల్లులు చాలా సందర్భాలలో చాలా పొసెసివ్‌గా ఉంటారు. కాబట్టి.. కొడుక్కి పెళ్లి కోడలు ఇంట్లోకి అడుగుపెట్టగానే వారిలోని అత్త బయటకు వస్తుంది. కోడలి కారణంగా తన కొడుకు ఎక్కడ దూరమైపోతాడా అని భయపడుతూ ఉంటారు. ఇక కొడుకు తమతో కాకుండా కోడలితో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు అనిపించిందా.. ఇక అంతే.. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తీసుకువచ్చేలా ప్రయత్నిస్తారు. తమ కొడుకు తమ మాట మాత్రమే వినాలని చూస్తూ ఉంటారు. 

2.ధనస్సు రాశి..
ధనుస్సు రాశి తల్లులు కూడా తమ పిల్లలు దూరమైపోతారేమో అనే భావన కలిగి ఉంటారు. ఈ క్రమంలో... వీరు అత్తలుగా మారినప్పుడు కొడుకు, కోడలి మధ్య గొడవలు పెట్టడానికి ఏ మాత్రం వెనకాడరు. వారి మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి అత్తలకు కోడల్లు ఎక్కువ అటెన్షన్ ఇస్తూ...ప్రేమను అందిస్తూ ఉండాలి. అప్పుడే వీరు శాంతంగా ఉంటారు.

3.మకర రాశి..

మకర రాశివారు మరీ దారుణంగా ప్రవర్తించరు. దగ్గరుండి మరీ కొడుకు, కోడలి మధ్య గొడవలు సృష్టించరు. కానీ... కొడుకు, కోడలి మధ్య ఏవైనా తేడాలు వస్తే... వీరు పరిష్కరించగల స్టేజ్ లో ఉన్నా కూడా... పరిష్కరించరు. వాళ్ల చావు వాళ్లు చస్తారు అని ఊరుకుంటారు. వారు గొడవలు పడుతుంటే వీరు చూసి రసహ్యంగా ఆనందిస్తూ ఉంటారు.


4.మీన రాశి..

మీన రాశికి చెందిన అత్తలు కూడా కోడలి విషయంలో దారుణంగా ప్రవర్తిస్తారు. వారిని రెచ్చగొట్టి మరీ గొడవలు పెంచేలా ప్రోత్సహిస్తారు. సాధ్యమైనంత వరకు గొడవలు పెంచాలని చూస్తూ ఉంటారు. అలా గొడవలు పెట్టనిది వీరికి నిద్ర పట్టదు.