mahashivratri 2023: రేపే మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు నిష్టగా ఉపవాసం ఉండి, శివారాధనలో ఉంటే అంతా శుభమే జరుగుతుంది. జ్యోతిష్యుల ప్రకారం.. మహాశివరాత్రి ముందు గ్రహా ల సంచారం శుభసూచకంగా ఉంది. కాగా శివరాత్రి నుంచి ఐదు రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

mahashivratri 2023: రేపే మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. శివుడికి అంకితం చేయబడిన ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. కాగా ఈ శివరాత్రికి ముందే గ్రహాల స్థితి అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతుున్నారు. ఫిబ్రవరి 18 న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే శుక్రుడు ఫిబ్రవరి 13 తేదీనే మీన రాశిలోకి ప్రవేశించాడు. అయితే శివరాత్రికి ముందే ప్రధాన గ్రహాల రాశిచక్రం మారడం శుభసూచకంగా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐదు రాశుల వారికి మంచి రోజులు స్టార్ట్ అవుతాయట. వాళ్లెవరెవరంటే..? 

మిథున రాశి

జ్యోతిష్యం ప్రకారం.. మహాశివరాత్రి ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మహాశివరాత్రి నుంచి వీరి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతిపనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. అంతేకాదు మీ ఆఫీసులో మీ పనితనంతో అందరితో ప్రశంసలు పొందుతారు. మీ ధైర్యం పెరుగుతుంది. గౌరవం రెట్టింపు అవుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. 

సింహ రాశి

జాబ్ కోసం వెతుకుతున్న వారు శుభవార్త వింటారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు ఉన్నత పదవిని పొందుతారు. వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు. ఈ రాశివారు శుభవార్తలు వింటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు శుభవార్తలు వింటారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. 

కన్యారాశి

ఈ రాశివారు కూడా మహాశివరాత్రిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. వ్యాపారం, ఉద్యోగంలో లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ధనలాభం పెరుగుతుంది. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. భాగస్వామితో సరదాగా గడుపుతారు. 

ధనస్సు రాశి

మహాశివరాత్రి నుంచి ఈ రాశివారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. డబ్బుకు కొదవ ఉండదు. ఇచ్చిన అప్పులు తిరిగి వస్తాయి. పెట్టుబడికి ఇది మంచి సమయం. ఈ రోజు నుంచి మీకు ఆదాయాన్ని అర్జించే మార్గాలు పెరుగుతాయి. సమాజంలో మీ విలువలు పెరుగుతాయి. ఉద్యోగంలో అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. 

కుంభరాశి

ఈ మహాశివరాత్రి కుంభరాశికి ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ రోజు కుంభరాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీళ్లు ఈ రోజు నుంచి మొదలు పెట్టిన ప్రతిపనిలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. డబ్బును బాగా పోగేస్తారు. ఖర్చులు అతిగా పెట్టరు. జాబ్ ఆఫర్ ను పొందే అవకాశం ఉంది. మీకు ఇది అనుకూలమైన సమయం. బంధువులతో సంబంధాలు బాగుంటాయి. మీ తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం పొందుతారు.