ఈ ఏడాది వచ్చే సూర్య, చంద్ర గ్రహణాలు ఇవే..

lunar sonar eclipse 2018 surya chndra grahana details is here
Highlights

జనవరి 31వ తేదీన ఆకాశంలో బ్లూమూన్ కనువిందు చేసింది. దానిని ప్రజలంతా కనులారా వీక్షించి సందడి చేశారు. ఇక ఇప్పుడు బ్లడ్ మూన్ వంతు వచ్చింది.

ఈ ఏడాది మొదలైన మొదటి నెలలోనే అంతరిక్షంలో అద్భుతం జరిగింది. జనవరి 31వ తేదీన ఆకాశంలో బ్లూమూన్ కనువిందు చేసింది. దానిని ప్రజలంతా కనులారా వీక్షించి సందడి చేశారు. ఇక ఇప్పుడు బ్లడ్ మూన్ వంతు వచ్చింది.

నేడు ఆకాశంలో అరుణవర్ణంలో చంద్రుడు ఆకాశంలో కనువిందు చేయనున్నాడు. మన దేశంలోనూ ఈ అరుణ వర్ణ చంద్రుడు కనపడనున్నాడు. ఈ సందర్భంగా అసలు ఈ ఏడాది ఏయో సూర్య, చంద్ర గ్రహణాలు కనపడనున్నాయో తెలుసుకుందాం..

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం..
జనవరి 31 ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఇప్పటికే అందరూ వీక్షించారు. ప్రపంచ దేశాలతోపాటు మనదేశంలోనూ పలువురు దీనిని వీక్షించి ఎంజాయ్ చేశారు.

ఫిబ్రరి 15న పాక్షిక సూర్యగ్రహణం... ఫిబ్రరి 15న ఏర్పడిన ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతం, పసిఫిక్, అట్లాంటిక్, అంటార్కిటికాలో కనిపించింది. 

జూలై 13న పాక్షిక సూర్యగ్రహణం... ఈ ఏడాది జూలై 13న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ ఆస్ట్రేలియా, పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల వారికి కనిపించింది.

జులై 27 సంపూర్ణ చంద్రగ్రహణం..

యూరప్, ఆసియా ఖండాల్లోని అధిక ప్రాంతాల ప్రజలు జూలై 27 లేదా 28న ఏర్పడే ఈ సంపూర్ణ చంద్రగ్రహణంను చూడవచ్చు. అలాగే ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాలోని దక్షిణ భూభాగం, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా ప్రాంతాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. మన దేశంలో ప్రత్యేకంగా కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ నుంచి ఈ చంద్రగ్రహణాన్ని తిలకించవచ్చు. అలాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల ప్రజలు కూడా చూడొచ్చు.

ఆగస్టు 11న పాక్షిక సూర్యగ్రహణం... ఈ ఏడాది ఆగస్టులో కూడా మరో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది ఆగస్టు 11న ఏర్పడుతుంది. ఉత్తర/తూర్పు యూరోప్, ఉత్తర/పశ్చిమ ఆసియా, ఉత్తర అమెరికాలోని ఉత్తర భాగం, అట్లాంటిక్, అర్కిటిక్ ప్రాంతాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది.

loader