కుజుడు ప్రస్తుతం సింహరాశిలో సంచారం ఉన్నది. 9.8.2019 నుంచి 25.9.2019 వరకు కర్కాటకరాశిలో సంచారం చేస్తాడు. కుజుడు సింహ సంచారంలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం

మేషం : విద్యార్థులకు ఒత్తిడి సమయం. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సంతోషం కోల్పోతారు.  అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. పరిపాలన సమర్ధత ఉంటుంది. ఆలోచనల్లో ఒత్తిడి పెరుగుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. పక్కవారి సలహాలు తీసుకుని ముందు అడుగు వేయాలి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

వృషభం :సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆహారంలో సమయ పాలన మంచిది. ఎక్కువ స్పైసీ ఆహారం తీసుకోకపోవడం మంచిది. కడుపులో మంట అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి.  శత్రువులపై విజయం సాధిస్తారు. క్రీం అచ్యుతానంత గోవింద జపం మంచిది.

మిథునం :కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఎంత ప్రయాణం చేసినా అలసట అనేది తొందరగా రాదు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :వీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆచి, తూచి వ్యవహరించాలి. కుటుంబ సంబంధాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిల్వ ధనాన్ని కోల్పోయే సూచనలు ఉన్నాయి. మధ్యవర్తిత్వాలు పనికిరావు. మాటల్లో కాఠిన్యత కనిపిస్తుంది.   గృహసంబంధ పనులు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

సింహం శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ అధికంగా చేస్తారు. కాని శరీరం తొందరగా అలసిపోదు. అహంకారం పెరుగుతుంది. శరీరం ఒక అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. అనవసర చికాకులు పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. శ్రీదత్తశ్శరణం మమ జపం మంచిది.

కన్య :విశ్రాంతి లభించదు. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.విహార యాత్రలు చేస్తారు. దేహసౌఖ్యం లోపిస్తుంది. దేశాంతరం తిరిగే ఆలోచన చేస్తారు. ఆహారంలో కొంత కారం, స్పైసీ ఫుడ్‌ను, వేపుడులు, నూనె పదార్థాలను బాగా ఇష్టపడతారు. శ్రీదత్త శ్శరణంమమ జపం మంచిది.

తుల :పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం అధికం చేస్తారు. లాభాలు వచ్చినా అనుకున్న సంతోషం ఉండదు. లాభాలు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. ఇతరులపై ఆధారపడతారు. సమిష్టి ఆశయాలు పూర్తిచేస్తారు. సంఘ వ్యవహారాల్లో పాల్గొనాలనే ఆలోచన బాగా ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

వృశ్చికం : సంఘంలో గౌరవం పెంచుకునే ఆలోచన బాగా పెరుగుతుంది. రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అందరిపై గెలవాలనే తపన పెట్టుకుటాంరు. వృత్తి ఉద్యోగాదుల్లో పోటీ లు అధికంగా ఉంటాయి. పోటీ ల్లో విజయ సాధన ఉంటుంది. సంతోషకరవాతావరణం నెలకొనే ప్రయత్నం చేస్తారు. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

ధనుస్సు :డబ్బులు కోల్పోయే సూచనలు. పరిశోధనల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. శుభకార్యాలలో పాల్గొనాలనే ఆలోచన   చేస్తారు. విద్య నేర్చుకోవడం వలన ఒత్తిడి ఏర్పడుతుంది. దూరదృష్టి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పరిశోధనల వల్ల జాగ్రత్తగా ఉండాలి. శ్రీ దత్తశ్శరణం మమ జపం మంచిది.

మకరం :ఊహించని ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు అవుతాయి. అనారోగ్య సూచనలు. ఇతరులపై ఆధారపడతారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. మానసిక, శారీరక ఒత్తిడి అధికంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కందిపప్పుదానం మంచిది. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

కుంభం :సామాజిక అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా మెలగాలి. భాగస్వామ్య అనుబంధాలు విస్తరించుకోవద్దు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండే సమయం. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. శ్రమతో పనుల సాధన చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు, ఫలితం రాదు. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

మీనం :శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. పోటీ లలో గెలుపు లభిస్తుంది. రోగనిరోధకశక్తి బావుంటుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. అప్పుల బాధలు తీరుతాయి. ఔషధ సేవనం ఉంటుంది. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ