Asianet News TeluguAsianet News Telugu

జులై 20, 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

july20th your horoscope

మేషం

మేషం: ఈ రోజు మీ మిత్రులను కలుసుకుంటారు. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

వృషభం

వృషభం: ఉద్యోగ , ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధలావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవస రం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

మిథునం

మిథునం : మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

కర్కాటకం

కర్కాటకం: మీకు ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఉం టుంది. కడుపు లేదా ఛాతికి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయవచ్చు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్య ఎక్కువగా బాధిస్తుంది. చదువులో ఆటంకాలు ఏర్పడతా యి. భూ, వాహన సంబంధ వ్యవహారాలు వాయిదా పడతాయి.

సింహం

సింహం: ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరుగవచ్చు. ఉద్యో గం, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు.

కన్య

కన్య: ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండ టం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహారశైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకం డి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

తుల

తుల: ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీ రకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటా రు. ఆర్థిక విషయాలు అనుకూలించవు.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

మకరం

మకరం: మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

కుంభం

కుంభం: ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటా రు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చు లు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

మీనం

మీనం: మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతా యి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.

Follow Us:
Download App:
  • android
  • ios