యోగం అనగా శరీరం మరియు మనస్సుల కలయిక. ఈ రెండూ కలిసినప్పుడు చేసే యోగ సాధన మాత్రమే ప్రయోజనాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ యోగాసనాలు వేయడం ద్వారా వేరు వేరు ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఈ క్రింద సూచింపబడినాయి.

యోగాసనాల ద్వారా ఈ క్రింది ప్రయోజనాలు నిరూపింపబడినాయి.

1. శరీరం పూర్తిగా క్రమబద్ధంగా పెరగటంతోపాటు అందం, కోమలత్వం, ముఖంమీద కాంతి కూడా చేకూరుతాయి.

2. అన్ని గ్రంథులు నియమంగా స్రవిస్తాయి.

3. మలినాలన్నీ పూర్తిగా ధమనుల ద్వారా బైటపడతాయి.

4. శ్వాస వ్యవస్థ అదుపులో ఉండటం వలన అనేక శారీరక మానసిక లాభాలు పొందటంతో బాటు ఊపిరితిత్తులు శక్తివంతంగా పని చేస్తాయి.

5. పై కండరాలతోపాటు లోపలి అంగాలపైన కూడా ప్రభావం ఉంటుంది.

6. శరీరమంతా రక్తప్రసరణ సమానంగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సరిగ్గా తన పనిని తాను నిర్వహిస్తుంది.

7. స్థూల శరీరంతోపాటు సూక్ష్మ శరీరం మీద, ముఖ్యంగా మనస్సుమీద కూడా మంచి ప్రభావం ఉంటుంది.

8. యోగాసనాల వలన వీర్యాన్ని నియంత్రించి, రక్షించుకుని దానిని ఊర్ధ్వగామినిగా మార్చవచ్చు.

9. సహనం, దృఢత్వం, ఆత్మసంయమనం, ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం విం మంచి గుణాలు వృద్ధి చెందుతాయి.

11. ఏకాగ్రత, అంతర్ముఖ తత్త్వాల వలన వ్యావహారిక జీవితాన్ని చక్కదిద్దుకోగలం. జీవితంపట్ల అభిరుచి, ఆసక్తితోపాటు మంచి ఆలోచనలు పెరిగి చెడు ఆలోచనలు నశిస్తాయి.

12. అలసట మాయమై శరీరం తేలికగా చురుకుగా ఉంటుంది.

13. తక్కువ సమయంలో తక్కువ శక్తి ఖర్చుతో ఎక్కువలాభం చేకూరుతుంది. ప్రాణ శక్తిని సమకూర్చుకోగలం.''

ఈ యోగాసనాల వల్ల వ్యక్తుల ఆరోగ్యంతోపాటు సౌందర్యమూ వృద్ధి అవుతుంది. కుటుంబనియంత్రణ కూడా సాధ్యపడుతుంది. ఆరోగ్యవంతులైన సాత్త్విక ప్రవృత్తిగల వ్యక్తులు సమాజానికి బరువుగా మారక సహాయకారులౌతారు. సమతౌల్యంతో కూడిన సరళమైన జీవితం, చెడు మార్గాల నుండి తనను తాను రక్షించుకోవడం, తన పర భేదభావన లేకుండడం. ఇంద్రియాలు అంతర్ముఖం కావడంతోబాటు మనస్సు అదుపులో ఉండడం ప్రారంభమౌతుంది. చురుకైన మెదడు, ఏకాగ్రత, మానసిక అశాంతులు లేకపోవడం, సహనం, వివేకం విం సద్గుణాలతో సాధకుడు సన్మార్గంలో నడిచి, నడిపించి ఈ సమాజానికి తనవంతు సేవలందిస్తూ ఋషి ఋణం తీర్చుకోగలుగుతున్నామనే భావనతో ఉంటా రు. రోగాన్ని నిరోధించేందుకు వ్యాధిని తగ్గించేందుకూ రెసిస్టెన్స్‌ పవర్‌ పెరగడానికి, సహనశక్తి, విల్‌పవర్‌ పెరుగడానికి ఉపయోగపడతాయి.

అష్టాంగయోగం :

యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది అంగాలతో కూడుకున్నదే అష్టాంగయోగం. ఈ ఎనిమిది మార్గాల ద్వారా ఆలోచనలు మార్చుకునే ప్రయత్నాన్ని భారతీయ విజ్ఞానం సూచించింది. ఆలోచనలే రోగాలు కారణం. ఈ ఆలోచనలకు కర్మలు కారణం. ఈ యోగ సాధనలో మనసును శరీరాన్ని నియంత్రించడం ప్రారంభంలో చాలాకష్టం అవుతుంది. అలా మనస్సును నిరోధించడానికి ప్రయత్నం చేసినవారిని పతంజలి మహర్షి మూడు రకాలుగా వర్గీకరించారు. వారు 1. ఉత్తమాధికారులు, 2. మధ్యమాధికారులు, 3.మందాధికారులు. మొదివారికి అభ్యాస, వైరాగ్యాలను బోధించారు. రెండవ వారికి తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం, మూడవ వారికి అష్టాంగయోగం. దీనిలో యమ నియమాలు చాలా ముఖ్యమైనవి. ఈ యమ నియమాలను సాధిస్తే మనసును అదుపులో పెట్టుకోవచ్చు. అష్టాంగయోగం ద్వారా కర్మను తగ్గించుకుని అసలు ఆలోచన అనేది రాని స్థితికి చేరుకోవడం జ్యోతిర్వైద్యం ద్వారా చేసే ప్రయత్నం.

అన్ని రాశుల వారు ఈ యోగాసనాలు తప్పనిసరిగా వేయాలి. ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజునుంచైనా యోగాసనాలు వేసి ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం వృషభ, మిథున, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల వారు కనీసం ఈ రోజు నుంచి అయినా యోగాసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలరు.