చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు గా ఈ పండగ చేసుకుంటారు.  పండుగ హోలికా దహన్‌తో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత ప్రజలు రంగులతో ఆడుకునే ప్రధాన కార్యక్రమం ఉంటుంది. 

హోలీ అత్యంత ముఖ్యమైన రంగుల పండుగ. ఈ హోలీ రోజున ప్రజలు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మాత్రమే కాకుండా అపరిచితులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు గా ఈ పండగ చేసుకుంటారు. పండుగ హోలికా దహన్‌తో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత ప్రజలు రంగులతో ఆడుకునే ప్రధాన కార్యక్రమం ఉంటుంది. 

దేశంలోని అనేక ప్రాంతాలలో హోలికా దహన్‌ను జరుపుకుంటారు. ప్రజలు చెడు వదిలించుకోవడానికి, శ్రేయస్సును పొందడానికి అనవసరమైన వస్తువులను భారీ కుప్పలుగా చేరుస్తారు ఇరుగుపొరుగు వారు ఖాళీ స్థలం చుట్టూ చేరి, ఇకపై అవసరం లేని వస్తువులను సేకరించి మంటల్లో వేసి హోలీకా దహన్ జరుపుకుంటారు.


హోలికా దహన్ రోజున చేయవలసినవి:

ద్రుక్ పంచాంగ్ ప్రకారం, హోలికాను కాల్చే ముందు హోలీ పూజ తప్పనిసరిగా చేయాలి. సరైన శుభ సమయంలో పూజలు చేయాలి. కర్మలు సక్రమంగా నిర్వహించాలి.
ఇంటికి ఉత్తర దిశలో నెయ్యి దీపం వెలిగించాలి. ఇది ఆనందం, శ్రేయస్సు తెస్తుంది.
హోలీ నాడు, మీ ఇంటిని అంకితభావంతో శుభ్రం చేయండి.విష్ణువును పూజించండి.
హోలికా దహన సమయంలో సాత్విక ఆహార పదార్థాలు తినాలని లేదా ఉపవాసం ఉండటం మంచిది.
హోలికా దహనానికి ముందు, మనం ఆ ప్రాంతాన్ని ఆవు పేడతో, గంగానది పవిత్ర జలంతో అభిషేకించాలి, దానిని శుభ్రంగా ,ఆచారానికి సిద్ధం చేయాలి.
మీరు హోలికా బూడిదను ఇంటికి తెచ్చి నాలుగు మూలల్లో ప్రతిచోటా ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి.
హోలీ రోజున మీ ఇంట్లోని పెద్దల పాదాలకు నమస్కరించి.... వారి ఆశీస్సులు పొందండి. ఇలా చేస్తే పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.
హోలికా దహన్ బూడిదను ఇంటికి తెచ్చుకొని.. వాటిని మీ భద్రపరచండి. ఇలా చేస్తే జీవితంలో డబ్బుకు లోటు ఉండదు.

చేయకూడనివి:

హోలికా దహనం రోజున మనం ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు. ఆ రోజు రుణం ఇస్తే ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్మకం.
హోలికా రోజున తెల్లని వస్తువులకు దూరంగా ఉండండి.పొరపాటున ఎటువంటి పాపపు పని చేయకండి.
సంధ్యా సమయం తర్వాత హోలీ ఆడకూడదు. ఇలా చేయడం అశుభం అని నమ్ముతారు.
ఈ రోజు మద్యం సేవించడం మానుకోండి.
కొత్తగా పెళ్లయిన ఏ స్త్రీ కూడా హోలికా దహనాన్ని చూడకూడదు.
అత్తగారు, కోడలు కలిసి హోలికా దహనాన్ని చూడటం వల్ల జీవితంలో ఇబ్బందులు వస్తాయి.