రాజులు యుద్ధాలకు వెళ్ళే కాలంలో చేసుకునే ఉత్సవంగా ప్రారంభమైన ఈ పండుగ కాలక్రమంలో ఆయా వృత్తుల వారు తమ అభ్యుదయాన్ని, జయాన్ని కాంక్షిస్తూ వారి వృత్తికి సంబంధించిన వస్తువులను పూజించే ఆచారం ఏర్పడింది. ఇప్పికీ విజయథమి 'ఆయుధపూజ' విశిష్టంగా కనిపిస్తుంది.
మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీః విశ్వమంగళమ్
షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నీరోగ శోభనమ్
జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా ఇష్టకామేశ్వరీ కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరమ్
పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్ మాంగల్యానంద జీవనమ్
విజయథమినాడు దేదీప్య మానంగా వెలిగే, చిద్రూపి అయిన రాజరాజేశ్వరీ రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మను సేవిస్తే వృత్తి ఉద్యోగాల్లో వృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులు వారి అర్హతలకు తగిన ఉద్యోగాన్ని పొందుతారు. విజయథమి నాడు రాజరాజేశ్వరి ఆశ్రిత రక్షపోషజననియై వర్ధిల్లుతుంది.
పురాణాల కథలను బ్టి, పూజా విధానాలను బ్టి నవరాత్రులు అందరికీ శక్తిని ఆరాధించేవైనప్పికీ, ప్రత్యేకంగా విజయథమి క్షత్రియుల పండుగ అని తెలుస్తుంది. రాజులు యుద్ధాలకు వెళ్ళే కాలంలో చేసుకునే ఉత్సవంగా ప్రారంభమైన ఈ పండుగ కాలక్రమంలో ఆయా వృత్తుల వారు తమ అభ్యుదయాన్ని, జయాన్ని కాంక్షిస్తూ వారి వృత్తికి సంబంధించిన వస్తువులను పూజించే ఆచారం ఏర్పడింది. ఇప్పికీ విజయథమి 'ఆయుధపూజ' విశిష్టంగా కనిపిస్తుంది.
''అత్ర అపరాజితా పూజనం సీమోల్లంఘనం శమీ పూజనం దేశాంతర యాత్రార్థినాం ప్రస్థానచ హితం'' అనే ప్రమాణం కూడా పూర్వపు యుద్ధకాలపు క్షత్రియులకే ఇది ఎక్కువ ఆచారంలో ఉన్నట్లు తొస్తుంది. వర్షాకాలం పోయి శరద్రుతువు ఆగమనం రాజులకు యుద్ధాలకు అనువైన కాలం. అందుకే ఆ రోజు అపరాజితను పూజించాలి. అనగా పరాజయం కలుగకుండా దేవిని ఉపాసించాలి. సీమోల్లంఘనం అంటే సరిహద్దులను దాటడం.
విజయకాలంలో బయలుదేరి విజయం సాధించడానికి ఆ సమయంలో సీమోల్లంఘనం చెప్పబడింది. ఆ తర్వాత చెప్పబడింది శమీపూజ. అనగా జమ్మిచెట్టును పూజించడం. ఈ వృక్షానికి ఆయుర్వేద వైద్యంలో ఉన్న ప్రాధాన్యమధికం. సాయంకాల సమయంలో గ్రామ ప్రజలంతా ఊరి చివర, సరిహద్దుల్లోని శమీవృక్ష స్థానానికి వెళ్ళి అక్కడ పూజించి ఆ పత్రాలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. పెద్దలకు మిత్రులకు జమ్మి ఆకులను ఇచ్చి -
''శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం''
అంటూ ఆశీస్సులు, అభినందనలు పొందుతారు. ఇంతేగాక విజయథమి రోజున పాలపిట్టను చూడడం జానపదుల ఆచారం. ''పాలపిట్ట దర్శనం కడుపునిండ భోజనం'' అనే మాట జానపదుల నోళ్ళలో తిరుగుతుంది.
సమస్త దేవతలకు, సమస్త మూర్తులకు అధిష్ఠానియై శ్రీచక్రస్థిత అయినటువిం ఈ రాజరాజేశ్వరి ఉపాసన భవ బంధాలను తొలగించడమే కాకుండా, ఇహపర ముక్తిదాయిని. ఈ లోకంలో అత్యున్నత శ్రేణి పదవులను, భోగాలను అందిస్తూ పరలోక ముక్తిని కలిగించేటటువిం తత్వం ఈ రూపానిదే. అందుకే ఈమెను చిద్రూపి పరదేవతగా కొలుస్తారు. అన్ని రకాల విజయాలకు మూలమైన ఈ తత్వ ఉపాసన అందరికీ అవసరమే. ఆ తల్లిని ఆరాదిద్దాం, సేవిద్దాం, ఆనందిద్దాం.
బంగారువర్ణ వస్త్రాలతో అమ్మవారు ధగధగా మెరిసిపోతుంది. ఈ రోజు అమ్మకు నైవేద్యంగా సమర్పించే పదార్థం రవ్వకేసరి.
డా.ఎస్.ప్రతిభ
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 8, 2019, 7:41 AM IST