1.భవ్య

వివాహం ఎప్పుడు?

జులై 26 2019 నుంచి జనవరి 2020 జనవరి వరకు సమయం అనుకూలంగా ఉన్నది. ఈ 6 మాసాలు మాత్రమే ప్రస్తుతం అనుకూలం. మీ జాతకంలో ఆలస్య వివాహానికి సూచన కనిపిస్తుంది. ఈ 6 మాసాల్లో వివాహం కాకపోతే 2021  మే తర్వాత సమయం మళ్లీ అనుకూలంగా ఉంటుంది. 2020 నుంచి 2021 మే వరకు అస్సలు వివాహానికి అనుకూలం కాదు. ఒకవేళ ఈ 6 మాసాల్లో వివాహం చేసుకున్నా 2020 జనవరి నుంచి 2021 మేవరకు కొంత ఒత్తిడిగానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. జపాలు, దానాలు అధికంగా చేసుకోవాలి.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : 1.అన్నదానం / పాలు / పెరుగు/ తెల్లి వస్త్రాలు, 2. పళ్ళు /స్వ్స్‌ీ / విద్యార్థులకు పుస్తకాలు / శనగపప్పు, 3. కందిపప్పు / దానిమ్మపళ్ళు / సపోట / కర్జూరాలు  నిరంతరం దానం చేస్తూ ఉండాలి.

2. మేరీ కుమారి

వివాహం ఎప్పుడు అవుతుంది ?భవిష్యత్తు ఎలా ఉంటుంది?

మీకు  ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. అన్ని ఒత్తిడులు అధికంగా ఉంటాయి. 2021 అంతం నుంచి 2023 అక్టోబరు వరకు అనుకూల సమయం. ఆ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అప్పుడు బావుంటుంది. నిరంతం దాన జపాలు అధికంగా చేసుకుంటూ ఉండాలి.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : కందిపప్పు/ కర్జూరాలు / దానిమ్మ పళ్ళు/ ఎరుపు వస్త్రాలు, 2. ఇడ్లీ / వడ / మినప సున్ని ఉండలు దానం చేయండి.

మీరు ఏ పనైనా చేస్తున్నా ఎదుటి వారి సలహా తీసుకొని ప్రారంభించండి. సొంత నిర్ణయాలు పనికిరావు.

3. శ్రీ హర్ష

ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

2020 మార్చ్‌ తర్వాత ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం కూడా మీకు చాలా ఆనందంగా ఉంటుంది. అన్నీ అనుకూలిస్తాయి.

శ్రీ రాజమాతంగ్యై నమః జపంమంచిది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

దానం:  కందిపప్పు / కర్జూరాలు / దానిమ్మపళ్ళు, 2. అన్నదానం / పాలు / పెరుగు దానం చేయండి.

4. రాధిక

మీరు మీ ఇద్దరి జాతక వివరాలు సరిగా పంపుతే సంతానం కోసం చూడడం జరుగుతుంది. మీరు సమయం పంపలేదు.

5. జాతకం ఎలా ఉంది?

శ్రీనివాస్

ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. సెప్టెంబరు 2019 వరకు. మీరు మీ గురించి ఆలోచించడం తక్కువ చేసిఎదుటి వారి గురించి ఆలోచించడం నేర్చుకోండి.   దానాలు అధికంగా చేయండి.

పశుపక్షాదులకు ఆహారం, 2. ఆకుకూరలు / కాయగూరలు / పెసరపప్పు, 3. స్వ్స్‌ీ, పుస్తకాలు దానం చేయాలి.జపం : శ్రీరా జయరామ జయజయ రామరామ నిరంతరం జపం చేస్తూ ఉండండి.

6. ప్రసాద్‌

భవిష్యత మరియు ఉద్యోగం ఎలా ఉంది?

ప్రస్తుతం మీకు అన్నివిధాలా సమయం చాలా అనుకూలంగా ఉన్నది. 2020 ఫిబ్రవరి వరకు అన్నివిధాలా అనుకూలం. ఏ రకమైన ఒత్తిడి లేకుండా పనులు సాఫీగా సాగిపోతూ ఉంటాయి.  2020 తర్వాత కొంత మీకు తెలియకుండానే ఒత్తిడి మీ వెంట ఉంటుంది.

జపం  : శ్రీరామ జయరామ జయజయ రామరామ , శ్రీ రాజమాతంగ్యై నమః

ఈ జపాలు రెండూ మంచివి.

7. వెంకట శివకుమార్‌

జాతకం ఎలా ఉంది?

మీకు ప్రస్తుతం జూన్‌ 2019 వరకు సమయం అనుకూలంగా ఉంది. జూన్‌ తర్వాత ఏవైనా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరువాత పనుల్లో కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది. జపాలు, దానాలు అధికంగా చేసుకోవాలి.

కందిపప్పు / కర్జూరాలు / దానిమ్మపళ్ళు, కందిపప్పు / కర్జూరాలు / దానిమ్మపళ్ళు,