Asianet News TeluguAsianet News Telugu

గ్రహణం రోజు పాటించాల్సిన నియమాలు

సూర్యుని చుట్టూ భూమి, భూమిచుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఈ రెండు ఒక్కోసారి సూర్యునితో ఒకే అక్షంపై ఉండడం కనిపిస్తుంది. ఒకే అక్షంలో సూర్యునికి చంద్రునికి మధ్య భూమి రావచ్చు. ఈ స్థితిలో సూర్యుని కాంతిని భూమి అడ్డగిస్తుంది. భూమినీడ చంద్రునిపై పడడంవలన చంద్రుడు కనపడడు. ఇదే చంద్ర గ్రహణం.

do's and don'ts on the day of chandra grahanam
Author
Hyderabad, First Published Jul 10, 2019, 10:13 AM IST

సూర్యుని చుట్టూ భూమి, భూమిచుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఈ రెండు ఒక్కోసారి సూర్యునితో ఒకే అక్షంపై ఉండడం కనిపిస్తుంది. ఒకే అక్షంలో సూర్యునికి చంద్రునికి మధ్య భూమి రావచ్చు. ఈ స్థితిలో సూర్యుని కాంతిని భూమి అడ్డగిస్తుంది. భూమినీడ చంద్రునిపై పడడంవలన చంద్రుడు కనపడడు. ఇదే చంద్ర గ్రహణం.

ఇది ప్రకృతి నియమం. ఈ సమయానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి నియమాలను పాటించాలని చెప్పారు. భూమికి అతి దగ్గరగా ఉండే గ్రహం చంద్రుడు. చంద్రుడు జలగ్రహం. మనఃకారకుడు. చంద్రుని ఆకర్షణ శక్తిచే సదా భూమిపై ఉండే జలవర్గం పై ప్రభావం పడుతూ ఉంటుంది. ఉదా : అమావాస్య పౌర్ణమి రోజులలో చంద్రుని ఆకర్షణశక్తి ప్రభావం వలన సముద్రం అల్లకల్లోలం అయి ఉప్పొంగుతుంది.

మానవ శరీరంలో కూడా 80 శాతం నీరు ఉండడం వలన ఈ రోజులలో మనిషికి చిత్త చాంచల్యం అధికంగా అయి, ఉద్రేకానికి గురి అవుతారు. కేవలం మాములు రోజులలోనే ఉద్రేకాలు ఎక్కువగా ఉన్నప్పుడు గ్రహణ సమయంలో ఆ ఆలోచనలు విపరీత స్థాయిని దాటుతాయి గనుక ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండును. అందువలన గ్రహణ సమయంలో జపాలు మొదలైనవి చేసుకుంటూ ఎక్కడికీ బయికి వెళ్ళకూడదనే నియమం పెట్టారు. ఈ సమయంలోనే వేరు వేరు నియమాలు పాటించాలని చెప్పారు. ఇది కేవలం మూఢ నమ్మకం కాదు. దీనిలో వైజ్ఞానికత చాలా ఉంది.

ఆహార నియమాలు : గ్రహణం పట్టడానికి 9 గం. ముందు నుంచి గ్రహం విడిచే వరకు కూడా ఏ రకమైన ఆహారాన్ని తీసుకోరాదు అని చెపుతారు ఎందువల్ల ?

మన శరీరం 80 శాతం నీటితో నిండి ఉన్నందు వలన శరీరం ఈ ప్రభావానికి లోనగుతుంది. సముద్రమే అల్లకల్లోలం అవుతూ ఉంటే మనిషి శరీరం ఎంత. అతనిలో ఉండే జఠరాంగాలు, మూత్రకోశాలు, మెదడు మొదలైనవి అల్లకల్లోలం అవుతాయి. కాని ఈ పరిణామం అప్పుడే వెంటనే కనబడదు. పోను పోను ముందు ముందు రోజుల్లో కనిపిస్తుంది. గ్రహణ సమయంలో శరీరంలో ఆహారం జీర్ణం కాకుండా ఉంటే ఆ వ్యతిరేక శక్తికి కడుపులో అల్సర్లు,  వేరు వేరు రకాల అనారోగ్యాలు వచ్చే సూచనలు కనబడతాయి. తీసుకున్న ఆహారం పూర్ణంగా జీర్ణం అయిన అది రక్తంలో కలిసి పోవాలి. అప్పుడు మాత్రమే ఏ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.

మనం తీసుకున్న ఆహారం శరీరంలో పూర్తిగా జీర్ణం కావడానికి 3 గంటల సమయం పడుతుంది. కాని అదే ఆహారం 9 గంటల్లో మొత్తం జీర్ణం అయి వ్యర్థపదార్థాలు కూడా శరీరంలో నుండి విడుదల కావడానికి సిద్ధంగా ఉంటాయి. ఏ కొంచెం ఆహారం కూడా శరీరంలో మిగిలి ఉండదు. కావున ఈ నియమాన్ని పాటించాలని చెపుతారు.

స్నానం : మానవుని శరీరం ఎన్నో అణువులతో తయారు చేయబడింది. ప్రతి అణువు విభిన్నమైన శక్తి కలిగిన కిరణాలను ఉత్పత్తి చేస్తుంది. ఆకర్షణ వికర్షణగల విద్యుత్‌ ఆకర్షణ శక్తి కేంద్రం. గ్రహణ కాలంలో చంద్రునిచే సంభవించే ఆకర్షణ శక్తిని ఈ అణుకోశాలుఆకర్షిస్తాయి. దీనిని ఎలక్ట్రో మ్యాగ్యిటిజమ్‌ అంటారు. ఇది దేహంలో ఎక్కువైతే శారీరక మానసిక ఆరోగ్యానికి భంగం కలుగుతుంది. మానసికంగా ఆలోచించే శక్తి పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. దీనినే బండ తనం, మొరటుతనం అంటారు. ఈ విధంగా జరగడానికి ఈ గ్రహణ ప్రభావం కూడా ఒక కారణం అవుతుంది. కావున గ్రహణ సమయంలో స్నానం చేసి జపం చేసుకోవడం మంచిది. కావున మన పూర్వీకులు ఈ విషయాలన్నీ చెప్పకుండ గ్రహణ సమయంలో స్నానం చేసి జపం చేసుకోవడం మంచిది అని మాత్రమే చెప్పేవారు.

పైన చెప్పిన ఆహార నియమాలు, స్నానాదికాలు అందరూ గ్రహణ సమయంలో తప్పక పాటించగలరు.

 

Follow Us:
Download App:
  • android
  • ios