సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 17.04.2025 గురువారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

పాత మిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం. దైవ చింతన పెరుగుతుంది.

వృషభ రాశి ఫలాలు

కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. అనవసర వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు వస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు దక్కవు.

మిథున రాశి ఫలాలు

విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో  నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.

కర్కాటక రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూలం.

సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోతాయి. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి.

కన్య రాశి ఫలాలు

ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వాహన ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

తుల రాశి ఫలాలు

బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చదువు విషయంలో అనుకూలం.

వృశ్చిక రాశి ఫలాలు

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. డబ్బు విషయాల్లో అన్నదమ్ములతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనస్సు రాశి ఫలాలు

పిల్లల చదువు, ఉద్యోగం విషయాలు సంతృప్తినిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దూరప్రాంత ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు వస్తాయి.

మకర రాశి ఫలాలు

దూర ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది. బంధు వర్గం నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. రుణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాల్లో  కొత్త సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులుంటాయి.

కుంభ రాశి ఫలాలు

దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్నదమ్ములతో సఖ్యత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాల్లో  ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అనుకూలం. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

మీన రాశి ఫలాలు

రుణ ప్రయత్నాలు కలిసిరావు. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించిన సమస్యలు వస్తాయి. ప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి.