userpic
user icon
0 Min read

Today Rasi Phalalu: ఈ రాశి వారికి కొత్త పరిచయాలతో లాభాలు.. నిరుద్యోగులకు శుభవార్తలు!

Daily horoscope for April 12, 2025 mesha vrishabha mithuna karka simha kanya tula vrischika dhanussu makara kumbha meena in telugu KVG
Daily horoscope for April 12, 2025 mesha vrishabha mithuna karka simha kanya tula vrischika dhanussu makara kumbha meena

Synopsis

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 12.04.2025 శనివారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

మొండి బాకీలు వసూలవుతాయి. అవసరానికి స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. పిల్లల చదువు విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభ రాశి ఫలాలు

ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

మిథున రాశి ఫలాలు

దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో వివాదాలు వస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకుగా తప్పవు. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటక రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా పరిస్థితి నిరాశకు గురిచేస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది.

సింహ రాశి ఫలాలు

రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాల్లో ఏర్పడిన పరిచయాలతో లాభం కలుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో సత్ఫలితాలు వస్తాయి.

కన్య రాశి ఫలాలు

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృథా ఖర్చులు ఉంటాయి. కొత్త వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి ఫలాలు

స్థిరాస్తి వివాదాల్లో రాజీ ప్రయత్నాలు విఫలమవుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. డబ్బు ఖర్చు కావచ్చు.

ధనస్సు రాశి ఫలాలు

పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృకరంగా ఉంటాయి. నిరుద్యోగులకు అనుకూలం. వాహన  కొనుగోలుకు ఆటంకాలు  తొలగిపోతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు.

మకర రాశి ఫలాలు

దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో  డాక్టర్ ను కలవాల్సి వస్తుంది. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో ప్రతికూలత పెరుగుతుంది.

కుంభ రాశి ఫలాలు

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార పరంగా కొత్త ప్రణాళికలతో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు బంధు మిత్రుల సహకారంతో సజావుగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు కలిసివస్తుంది.

మీన రాశి ఫలాలు

కొందరి ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆకస్మిక  ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు.

 

Download App

Latest Videos