userpic
user icon
0 Min read

Today Rasi Phalalu: ఈ రాశి వారు ఎవరినైనా తన మాట తీరుతో ఆకట్టుకుంటారు...!

Daily horoscope for April 10, 2025 mesha vrishabha mithuna karka simha kanya tula vrischika dhanussu makara kumbha meena in telugu KVG
Daily horoscope for April 10, 2025 mesha vrishabha mithuna karka simha kanya tula vrischika dhanussu makara kumbha meena

Synopsis

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 10.04.2025 గురువారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. పనులు చకచకా సాగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా అనుకూలం. వ్యాపార, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభ రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు వస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. ఉద్యోగంలో కలిసిరాదు. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ.

మిథున రాశి ఫలాలు

బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు వస్తాయి. ఇంటి బాధ్యతలు చికాకు తెప్పిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారంలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగంలో గందరగోళంగా ఉంటుంది.

కర్కాటక రాశి ఫలాలు

కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. మీ మాట తీరుతో ఎవరినైనా ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి.

సింహ రాశి ఫలాలు

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలం. మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు.

కన్య రాశి ఫలాలు

అప్పుల బాధలు తొలగిపోతాయి. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త ఉద్యోగం రావచ్చు. కుటుంబం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాల్లో ఆశించిన ట్రాన్స్ ఫర్ వస్తుంది.

తుల రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. మిత్రుల నుంచి అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు తెప్పిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృశ్చిక రాశి ఫలాలు

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అధిక శ్రమతో కానీ  గాని పనులు పూర్తి కావు. ముఖ్యమైన  కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప  అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

ధనస్సు రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాల్లో మరింత అనుకూలం.

మకర రాశి ఫలాలు

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాల్లో శ్రమ మరింత పెరుగుతుంది.

కుంభ రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపార, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు తెప్పిస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు వస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు వస్తాయి.

 

Download App

Latest Videos