Asianet News TeluguAsianet News Telugu

చాణక్య నీతి... ఆ విషయంలో పురుషులకంటే స్త్రీల తెలివి నాలుగు రెట్లు ఎక్కువ..!

చాణక్యుడి ప్రకారం...పురుషులకంటే  స్త్రీలకు రెట్టింపు ఆహారం, నాలుగు రెట్లు తెలివితేటలు, ఆరు రెట్లు ధైర్యం, ఎనిమిది రెట్లు కామం కలిగి ఉంటారని చెబుతారు.

Chanakya Neeti: Women are 4 times more intelligent than men, 6 times more courageous ram
Author
First Published Oct 2, 2024, 4:19 PM IST | Last Updated Oct 2, 2024, 4:19 PM IST

ప్రముఖ ఆర్థిక శాస్త్ర నిపుణుడు, తత్వవేత్త చాణక్యుడు తెలియనివారు ఉండరు. ఆయన మానవ జీవితం గురించి ఇప్పటికే చాలా విషయాలు చెప్పాడు. అదేవిధంగా పురుషులకంటే.. స్త్రీలు కొన్ని విషయాల్లో చాలా గ్రేట్ అని చెప్పారు. ఎలాంటి విషయాల్లో మహిళలు.. పురుషులను ఓడించగలరో, చాణక్యుడు ఏం చెప్పాడో చూద్దాం...

చాణక్యుడి ప్రకారం...పురుషులకంటే  స్త్రీలకు రెట్టింపు ఆహారం, నాలుగు రెట్లు తెలివితేటలు, ఆరు రెట్లు ధైర్యం, ఎనిమిది రెట్లు కామం కలిగి ఉంటారని చెబుతారు. ఈ రెండు పంక్తులలో, ఆచార్య చాణక్యుడు స్త్రీ  4 లక్షణాలను వివరించాడు. స్త్రీల ఆహారం పురుషులతో పోలిస్తే రెట్టింపు అని చెబుతారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ శారీరక శ్రమ చేయాల్సి వస్తుందన్నారు. ఇంటి పనులన్నీ ఆమె చేస్తుంది. పిల్లల సంరక్షణ కూడా వారి బాధ్యత. దానికి శారీరక బలం చాలా అవసరం. అందుకే మగవారి కంటే ఎక్కువగా తింటారు.

తెలివి నాలుగు రెట్లు ఎక్కువ:
పురుషుల కంటే స్త్రీల తెలివితేటలు నాలుగు రెట్లు ఎక్కువ అని ఆచార్య చాణక్యుడు అన్నారు. వారు కుటుంబాన్ని మాత్రమే కాకుండా బంధువులను కూడా చూసుకుంటారు. వారి  తెలివి చాలా పదునైనది. ఇంటిని ఎలా నిర్వహించాలో మహిళలకు మాత్రమే తెలుసు. చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోగల సామర్థ్యం వారిలో ఎక్కువగా ఉంటుంది.

ఆచార్య చాణక్యుడు పురుషుల కంటే స్త్రీలకు ఎనిమిది రెట్లు ఎక్కువ కామం ఉంటుందని చెప్పారు. అయితే, వారు దీన్ని పాపంగా భావించలేదు. ఇది అనైతికం లేదా వారి ఉదాసీనతకు సంకేతం కాదు. స్త్రీలు పిల్లలను కనాలి. కాబట్టి ఈ రకమైన భావన వారిలో బలంగా ఉంటుంది. పితృ ఋణం తీరాలంటే మోహం సులువైన మార్గమన్నారు. పిల్లలను కనడం ద్వారా మాత్రమే ఈ రుణ విముక్తి లభిస్తుంది.

ఆరు రెట్లు ఎక్కువ ధైర్యం:
పురుషుల కంటే స్త్రీలకు ఆరు రెట్లు ఎక్కువ ధైర్యం ఉంటుందని చాణక్యుడు పేర్కొన్నాడు. మనుషులకు భిన్నంగా ఆడ జంతువులు, పక్షులు తమ సంతానాన్ని కాపాడుకునే సమయం వచ్చినప్పుడు ఎన్నో రెట్లు బలపడతాయని అన్నారు. వారు పోరాటాన్ని వదులుకోరు. మహిళలు తమ కుటుంబాల భద్రత కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు.


చాణక్యుడి మాటలను అర్థం చేసుకోవడం ముఖ్యం: కాలం మారినందున, ఇప్పుడు ప్రతిదీ తలక్రిందులైంది. స్త్రీలకు తక్కువ ఆహారం అందుతుంది, దీనివల్ల వారు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పురుషాధిక్య సమాజం మహిళలకు ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కులు ఇవ్వదు. అంతేకాదు వారి తెలివితేటలను కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇప్పుడు మహిళలు విద్యను అభ్యసించడం ప్రారంభించారు, కాబట్టి వారు తమ ప్రతిభను చూపడం ప్రారంభించారు. వారు అన్ని రంగాలలో పురుషుల కంటే ముందున్నారు. వారు ఇంటి , బయట పని రెండింటినీ చాలా సులభంగా నిర్వహించగలుగుతారు. చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలు స్త్రీ పురుషులిద్దరూ అర్థం చేసుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యా ఉండదు. సంబంధాలు ఎప్పుడూ మధురమే
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios