1. సుకేష్‌ నాయుడు (శ్రీకాకుళం)

ఫ్యూచర్‌ ఎలా ఉంటుంది. సొంత ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాను.

2019 జులై నుంచి బావుంటుంది. అప్పుటి నుంచి సొంత ఇంటి ప్రయత్నాలు కూడా బాగా ఫలితాలు ఇస్తాయి. వైవాహిక జీవితంలో కొంత అడ్జస్ట్‌ కావాలి. తప్పదు.

జపం : చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగరనాయికా జపం నిరంతం చేసుకుంటూ ఉంటే సొంత ఇంటి కల తొందరగా పూర్తి చేసుకుంటారు.

దానం : 1. కందిపప్పు /కర్జూరాలు/ దానిమ్మ పళ్ళు / 2. నూనె / పల్లీలు , 3. అన్నదానం / పాలు/ పెరుగు మొదలైనవాటిలో ఏది వీలైతే అవి తప్పనిసరిగా చేయాలి.

2. సత్యనారాయణ (ఒంగోలు)

ఉద్యోగం మరియు భవిష్యత్తు ?

ప్రస్తుతం సమయం మామూలుగా ఉన్నది. సాధారణమైన ఉద్యోగం మాత్రమే వస్తుంది. 2021 నవంబర్‌ తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. మీరు నిరంతరం దుర్గా పూజ చేసుకోవడంమంచిది.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః; శ్రీ దత్త శ్శరణం మమ జపాలు మంచివి. ఈ జపం నిరంతర పారాయణం చేసుకోవాలి.

దానం : 1. ఇడ్లీ, వడ / మినప సున్ని ఉండలు; 2. నూనె/ పల్లీలు / 3. గోధుమపిండి / గోధుమ రవ్వ మొదలైనవి నిరంతరం దానం చేస్తూ ఉండాలి.

3. భానుగౌడ్‌ (నిజామాబాద్)

నేను ఏ ఫీల్డ్‌ను ఎంచుకుంటే బావుంటుంది?

2020 సెప్టెంబర్‌ తర్వాత జీవితంలో మంచి మార్పులకు అవకాశం ఉంది. అప్పి వరకు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో చికాకులు ఎక్కువగా ఉంాయి. మీకు ఉద్యోగమైన వ్యాపారమైనా ఏదైనా సరే. ఒకవేళ వ్యాపారం చేయదలచుకుంటే మాత్రం ఆహార పదార్థాలకు సంబంధించినవి, నీటికి సంబంధించినవి, ఖాదీ బట్టలకు సంబంధించినవి. వీటికి సంబంధించిన వాటిలో ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనాచేసుకుంటే బావుంటుంది.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః; శ్రీ మాత్రే నమః మంచివి.

దానం : కందిపప్పు/ దానిమ్మపళ్ళు/ కర్జూరాలు, 2. నూనె/ పల్లీలు , 3. గోధుమపిండి / చపాతీలు చేసి ఇవ్వడం, 4. పళ్ళు/ స్వీట్స్ దానం చేయడం మంచిది.

4. చైతన్య హరిరామ కుమార్‌ (అనంతపురం)

ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉంది? అప్పులు అధికంగా ఉన్నాయి?

మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఇంకో సంవత్సరం వరకు సమయం అనుకూలంగానే ఉంది. 2020 నుంచి 3 సం||పాటు అంత మంచి సమయం కాదు. ఈ సంవత్సరంలోనే కొంత సిటిల్‌ చేసుకునే ప్రయత్నం చేయండి.

జపం : సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః? శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

దానం : కందిపప్పు/ దానిమ్మపళ్ళు / కర్జూరాలు, 2. ఇడ్లీ/ వడ/ సున్ని ఉండలు, 3. పళ్ళు/ 4.నూనె దానం చేయడం మంచిది.

పైన చెప్పిన జపాన్ని నిరంతరం చేసుకుంటూ ఉండడం. ఆదాయ వ్యయాలు సమానం కావున దానం ఎక్కువగా చేయాలి. లేకపోతే ఆర్థిక సమస్యలు తప్పవు.

5. జె. స్వర్ణ

వివాహం ఎప్పుడు అవుతుంది?

2020 జూన్‌ వరకు సమయం అంత అనుకూలం కాదు. చెప్పుకోదగిన పెద్ద లోపాలు ఏమీ లేవు. కొన్ని దానాలు చేసుకోవడం వల్ల మరింత ఆనందంగా ఉండవచ్చు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం ఏదైనా వస్తుంది. ప్రస్తుతం సమయం బాలేనందున ఏదో చిన్న ఉద్యోగం చూసుకోండి. 2020 జూన్‌ తర్వాత వివాహానికి ఉద్యోగానికి అన్నికీ సమయం అనుకూలం అవుతుంది.

జపం : కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ జపం నిరంతరం చేసుకుంటూ ఉండండి.

దానం : కందిపప్పు/ దానిమ్మ పళ్ళు/ 2. పళ్ళు/ 3. పశుపక్షాదులకు ఆహారం, నీరు పెట్టడం చేయాలి.

6. వెంకటేష్‌ (రంగారెడ్డి, ముచ్చర్ల)

 మీరు ప్టుటిన సమయం మరియు జాతకంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పలేదు. ఆ వివరాలు చెప్పగలరు.

7. సునీల్‌ కుమార్‌ (గుంటూరు)

వివాహం మరియు కెరీర్‌ ఎలా ఉంటుంది?

2019 ఆగస్టు నుంచి మార్పుకు మంచి అవకాశం ఉంది. వివాహం 28 సం|| ఆ తర్వాత అవుతుంది. అప్పుడు అనుకూల సమయం. అప్పుడు వివాహ ప్రయత్నాలు చేసుకోండి.

జపం : కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : ఇడ్లీ/ వడ/ 2. నిమ్మకాయ పులిహోర/ అలంకరణ వస్తువులు దానం చేయండి.

8. మహేష్‌ (హైదరాబాద్)

ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉందా?

ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. 2023 తర్వాత ఉద్యోగానికి అవకాశం ఉంది. మీకు ప్రభుత్వ ఉద్యోగంలో మొది స్థాయి ఉద్యోగాలంటే ద్వితీయస్థాయి ఉద్యోగాలకి అవకాశం ఎక్కువ. డైరెక్ట్‌ ప్రభుత్వ ఉద్యోగం కోసం  ప్రయత్నం చేయకండి. దానికోసం వేచి చూడకుండా ఏదో ఒక చిన్నదానిలో  ప్రస్తుతం జాయిన్‌ అవ్వండి.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః

దానం : అన్నదానం / పాలు/ పెరుగు, 2. గోధుమపిండి/ గోధురమరవ్వ, 3. ఇడ్లీ, వడ/ సున్నిఉండలు, 4. కందిపప్పు/ దానిమ్మ పళ్ళు దానం చేయడం మంచిది.

9. పృథ్వీ (హైదరాబాద్)

ఏమైనా దోషాలు ఉన్నాయా?

దానం కొద్ది బిడ్డలు అనే సామెత ఇక్కడ వర్తిస్తుంది. మీరు కందిపప్పును వారానికి 5 కిలోల చొప్పున అనాథ శరణాలయాలకి దానం చేస్తూ ఉండడం. ఇంకా అధికంగా వీలైతే అధికంగా చేయండి.

దోషం పిల్లవాడికి లేదు. మీకు ఎనర్జీ లేదు. మీరు దానిని పెంచుకునే ప్రయత్నం చేయండి.

జపం : శ్రీ మాత్రేనమః జపం చేసుకోండి.

డా.ఎస్.ప్రతిభ