Asianet News TeluguAsianet News Telugu

కర్కాటక రాశి లోని చెడు లక్షణాలు ఇవే.!

పనిని ప్రారంభించే ముందు..  అది జరగదు అనే కోణంలోనే ఆలోచిస్తూ ఉంటారు. పాజిటివ్ కన్నా కూడా వీరు నెగిటివ్ గా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఓటమికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు.

Bad Traits of Cancer Zodiac sign
Author
Hyderabad, First Published Jan 25, 2022, 2:41 PM IST


మనిషి అన్న తర్వాత.. ప్రతి ఒక్కరిలోనూ మంచి, చెడు లక్షణాలు ఉంటాయి. చెడు లక్షణాలు అనగానే.. నేరాలు చేస్తారు అని కాదు.. కోపం ఎక్కువగా ఉండటం, ద్వేషించడం అలాంటివి కాస్త ఎక్కువగా ఉండటం. ఇక కర్కాటక రాశి వారి విషయానికి వస్తే.. వారు చాలా సున్నితంగా ఉంటారు. ఇతరుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తారు. అందరితోనూ ప్రేమగా ఉంటారు. వీరికి సృజనాత్మకత కూడా చాలా ఎక్కువ. అయితే.. ఒక్కోసారి మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటారు. ఈ రాశిలోని చెడు లక్షణాలు ఏంటో ఓసారి  చూసేద్దాం..

కర్కాటక రాశివారు.. పనిని ప్రారంభించే ముందు..  అది జరగదు అనే కోణంలోనే ఆలోచిస్తూ ఉంటారు. పాజిటివ్ కన్నా కూడా వీరు నెగిటివ్ గా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఓటమికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు.

కర్కాటక రాశివారు.. నవ్వుతూనే ఉంటారు. అయితే.. సడెన్ గా మూడీగా మారిపోతారు. ఒక్క చిన్న మాటకే.. డల్ అయిపోయి.. మూడీగా మారిపోతారు. మళ్లీ మూమూలు స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. వీరికి ఆనందం, నవ్వు, దుఖం అన్నీ ఎక్కుువే.. కాబట్టి.. దీనిని వీరు కంట్రోల్ చేసుకోవాలి.

ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు... అది మంచిదా కాదా..? దాని పరిణామాలు ఎలా ఉంటాయి అని ఆలోచించకుండా...  ఎమోషన్స్ పై దృష్టి పెడతారు. ఎమోషనల్ లో నిర్ణయాలు తీసుకుంటారు. 

ఇక.. తమ జీవితంలో ఉన్నవారిని తొందరగా వదులుకోవడానికి ఇష్టపడరు. ఇది మంచి లక్షణమే అయితే.. ఎక్కడ దూరమైపోతారా అనే భయంతో.. వారిని కొద్ది నిమిషాలపాటు కూడా వదిలిపెట్టరు. అంటిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది ఎదుటివారికి ఇబ్బందిగా ఉందని తెలిసినా కూడా అలానే చేస్తూ ఉంటారు.

ఇక.. తమ జీవిత భాగస్వామిపై ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు. ఈ క్రమంలో వారిపై ఎక్కువగా అనుమానం పెంచుకుంటారు. ప్రతి నిమిషం వారిని సందేహిస్తూనే ఉంటారు. చిన్న విషయాలకే బాధపెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios