Asianet News TeluguAsianet News Telugu

భోజనం ఏ పాత్రలో చేస్తే లాభం..?

పూర్వకాలంలో రాజులు, జమీందారులు బంగారు పళ్ళాలలోను, రెండవ తరగతివారు వెండి పళ్ళాలలోను, కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు పాటించేవారు అరిఆకు, లేక మోదుగ ఆకు లేక మఱ్ఱి ఆకులతో తయారు చేసిన విస్తరిలో తినడం సంప్రదాయం.

astrology..types of eating plates and its uses
Author
Hyderabad, First Published Nov 15, 2018, 2:57 PM IST

భోజన పాత్ర అంటే మనం  తీసుకునే ఆహారం ఉంచేది అని అర్థం. ఆహారంతీసుకోవాలంటే ఒక ప్లేటు కాని, ఒక విస్తరి కాని తీసుకుని అందులో పెట్టుకొని తినాలనే విషయం అందరికీ తెలిసిందే. ఇవి ఏవీ లేకుండా ఆహారం తినడం సాధ్యం కాదు. పళ్ళు, కూరగాయల ముక్కలులాటి కొన్ని పదార్థాలు మాత్రం ఇవి ఏవీ లేకుండానే తినవచ్చు. కాని మనం రోజు తినే ఆహారం ఏ పాత్రలో తినాలి అనే విషయం తెలుసుకుందాం.

సాధారణంగా తినడానికి ఉపయోగించే పాత్రలు ఎవరి స్థాయికి తగినట్టుగా వారి దగ్గర ఉంటాయి. బంగారం, వెండి, కంచు, స్టెయిన్‌లెస్‌స్టీల్‌, అల్యూమీనియం, గాజు, పింగాణిలతో తయారయ్యే పాత్రలు, అరి ఆకులు, మోదగ, మఱ్ఱి, బాదాం మొదలైనవి ముఖ్యమైనవి.

పూర్వకాలంలో రాజులు, జమీందారులు బంగారు పళ్ళాలలోను, రెండవ తరగతివారు వెండి పళ్ళాలలోను, కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు పాటించేవారు అరిఆకు, లేక మోదుగ ఆకు లేక మఱ్ఱి ఆకులతో తయారు చేసిన విస్తరిలో తినడం సంప్రదాయం. మిగిలిన వారు కంచు, అల్యూమీనియం, పింగాణిలను ఉపయోగించేవారు. ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరు స్టీల్‌ పాత్రలలోనే తినడం అలవాటుగా మారిపోయింది.ఏ పాత్రలలో తింటే ఏమి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఏది మంచిది అనే విషయాలు చూద్దాం

బంగారం : దీనిలో తినడం వలన ఆహారం పూర్తిగా జీర్ణమగును. వీర్యవృద్ధి కలుగుతుంది. కంటిచూపు బాగుపడుతుంది.

వెండి : దీనిలో కూడా ఆహారం సరిగా జీర్ణమౌతుంది. పిత్తదోషాలు తగ్గుతాయి, అతిమూత్ర వ్యాధి ఉండదు, సంపూర్ణ ఆరోగ్యకరం.

కంచుపాత్ర : పైత్యాన్ని తగ్గిస్తుంది. కంటి దోషాలను దూరం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది, శరీరం కాంతివంతంగా ఉంటుంది. ఎముకలకు బలాన్ని చేకూరుతుంది. గుండెనొప్పులను నివారిస్తుంది.

స్టీల్‌ పాత్ర : ఏనీమియా వ్యాధి రాకుండా చేస్తుంది, జాండీస్‌ను నివారిస్తుంది, వీర్యవృద్ధి, జీర్ణశక్తిని పెంచుతుంది.

అల్యూమీనియం పాత్ర : ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. చర్మ రోగాలకు కారణం అవుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది.

గాజుపాత్ర : వ్యాధిని తగ్గించే గుణం కాని, వైద్యకర గుణాలుకాని ఏవీ లేవు. కాని ఇందులో పెట్టిన ఆహారానికి ఏ రకమైన దోషాలు రావు. ఏ రకమైన ఆహారం అందులో ప్టోమో అవి మాత్రమే ఉంటుంది. కాని కొత్త కొత్త లక్షణాలు ఇందులోకి రావు. ఈ పాత్రలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. పగలకుండా జాగ్రత్త పడాలి, కొద్దిగా పగిలిన గాజు వస్తువులైన అందులో ఆహార పదార్థాలు పెట్టరాదు. అది హానికరం.

అరిఆకు : ఇది చాలా శ్రేష్ఠమైనది. కఫ, వాతాలు తగ్గిస్తుంది, బలాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. శరీరకాంతిని పెంచుతుంది. ఆకలిని పుట్టిస్తుంది. పైత్యానికి తగ్గిస్తుంది. కడుపులో ఉండే కురుపులను నివారించటంలో ఉపయోగపడుతుంది.

మోదుగ ఆకు : బ్లడ్‌కు సంబంధిన రోగాలు నివారించబడతాయి, బుద్ధిని పెంపొందిస్తుంది.

మర్రి ఆకు :  జీర్ణశక్తిని పెంచుతుంది, కంటిచూపును పెంచుతుంది. వివిధ రకాల వ్యాధులు రాకుండా చేస్తుంది.

పనస ఆకు : పిత్త దోషాలను నివారిస్తుంది, జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.

రావి : పిత్తరోగాలు, శ్లేష్మ రోగాలను తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. చదువుకునే వారి ఉపయోగపడుతుంది.

అరి ఆకు తాజాగా ఉన్నప్పుడే అందులో తినాలి. మిగిలిన విస్తరి ఆకులు తాజా ఉన్నప్పుడు తినవచ్చు. ఆ ఆకులు ఎండి పోయిన తరువాత కూడా ఉపయోగించవచ్చు. తొందరగా మాటలు రానిపిల్లలకు పూర్వకాలంలో కొంతకాలం రాగి ఆకులలో భోజం పెడితే వస్తాయని వారి నమ్మకం ఉండేది.

ప్లాస్టిక్‌ ప్లేట్లు ఉపయోగించడం వాటిలో ఆహారాన్ని తీసుకోవడం హానికరం. పైన తెలిపిన వాటిలో ఎవరి స్థాయికి తగినట్టుగా వారు ఆ పాత్రలు, ఆకులను భోజనానికి ఉపయోగించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios