ఈ సెప్టెంబర్ నెల రాశిఫలాలు

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this september 2018 month horoscope is here

మేషం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును.  పోటీ రంగంలో విజయావకాశాలు అధికంగా ఉండును. విద్యార్థులకు ఉత్తమసమయం. గృహ, కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. వీరికి సామాజిక సంబంధాలు అనుకూలంగా ఉండును. ఆహార, విద్య విషయాలలో సమయ పాలన పాటించాలి లి. 15,16 తేదీలలో ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయాలి. వీరికి శివారాధన, గణపతి ఆరాధన లక్ష్మీఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

వృషభం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. విద్యార్థులకు ఉత్తమ సమయం. ధనలాభం సూచితం. గృహ, కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. జనసహకారం లభిస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి. వీరు దానధర్మాలకు అధిక వ్యయం చేస్తారు. సంతానం వల్ల సంతోషం లభిస్తుంది. 17,18 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య ఆరాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన మేలు చేస్తాయి.

మిథునం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలు ఆనందప్రదంగా ఉండును. విద్యార్థులకు ఈ మాసం అనుకూలం. సంతానం వల్ల సంతోషం లభిస్తుంది. జనసహకారం అనుకూలంగా ఉండును. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. 20,21 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యస్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కర్కాటకం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. పోటీ రంగంలో విజయాలు సాధిస్తారు. విద్యార్థులు అనుకూల సమయం. గృహ, కుటుంబ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి. జనసహకారం వల్ల సంతోషం ఏర్పడుతుంది. 22,23 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా  వీరికి సుబ్రహ్మణ్యారాధన, ఆదిత్యస్తోత్ర పారాయణ, గణపతి ఆరాధన, మంచి ఫలితాలనిస్తాయి.

సింహం : ఈ రాశివారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. కుటుంబ సౌఖ్యం గోచరిస్తుంది. విద్యార్థులకు ద్వితీయార్థం అనుకూలంగా ఉండును. పెట్టుబడులు వ్యాపారం వాయిదా వేయుట మంచిది. పోటీ  రంగంలో విజయావకాశాలు సూచితం. దూర ప్రయాణాలకు అవకాశమున్నది.24,25,26 తేదీల్లో ముఖ్య నిర్ణయాలు వాయిదా. వీరికి దత్తాత్రేయ స్తోత్రం, శివారాధన, దుర్గాస్తోత్రపారాయణ, విష్ణ్వారాధన మంచి ఫలితాలనిస్తాయి.

కన్య : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. గృహ, కుటుంబ విషయాల్లో సంతోషకర వాతావరణం. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాదులు సామాన్యంగా ఉండును. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. 27,28 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. వీరికి శివారాధన, గణపతి ఆరాధన, ఆదిత్య స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తాయి.

తుల : ఈ రాశివారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో వృత్తి, వ్యాపారదులలో ఆర్థిక లాభాలు సూచితం. సేవక జన సహకారం లభిస్తుంది. సంతానవర్గం అభివృద్ధి బాగుండును. ఆహార విషయంలో సమయపాలన అవసరం. ఆధ్యాత్మిక చింతన బాగుండును. 29,30,2 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. వీరికి సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయస్తోత్రం, గణపతి ఆరాధన శుభ ఫలితాలనిస్తాయి.

వృశ్చికం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. వీరికి వృత్తి ఉద్యోగ విషయాల్లో పదోన్నతి, ఆర్థిక లాభాలపై దృష్టి ఏర్పడుతుంది. సోదర జన సహకారం సూచితం. గృహ, కుటుంబ విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూల సమయంగా గోచరిస్తుంది. దూర ప్రయాణాలకు అనుకూలం. దాన ధర్మాలకు అధికంగా ఖర్చు చేస్తారు. 4,5 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. వీరికి దత్తా త్రేయస్తోత్రం, దుర్గాపారాయణం, శివారాధన ఉత్తమ ఫలితాలనిస్తాయి.

ధనస్సు : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతి సూచితం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. గృహ, వాస్తు మరియు వాహన లాభం సూచితం. మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు  . జాగ్రత్త అవసరం. విద్యార్థులకు అనుకూల సమయం. 6,7 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. శివారాధన, గణపతి ఆరాధన దుర్గాస్తోత్రం, మంచి ఫలితాలను ఇస్తాయి.

మకరం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. ఆకస్మిక ధనలాభం సూచితమౌతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వృత్తి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్త అవసరం. వీరికి గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రద వాతావరణం సూచితం. విద్యార్థులకు అనుకూల సమయం. 8,9 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. వీరికి నవగ్రహ స్తోత్రపారాయణ, దత్తాత్రేయ స్తోత్రం, శివారాధన, దుర్గాస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తాయి.

కుంభం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాల్లో ఆనందప్రద వాతావరణం ఉంటుంది.   ఆకస్మిక ధనలాభం సూచితం. ఆధ్యాత్మిక చింతన బాగుండును. జనసహకారం అనుకూలంగా ఉండును. పోటీ రంగంలో విజయావకాశాలు అధికంగా గోచరించుచున్నవి. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. 10,11 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా. వీరికి ఆదిత్యహృదయం, సుబ్రహ్మణ్యారాధన, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

మీనం : ఈ రాశివారికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. ప్రథమార్థంలో పోటీ రంగంలో విజయావకాశాలు అధికంగా ఉంటా యి. సోదరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రథమార్థంలో విద్యార్థులకు ఉత్తమ సమయం. గృహ, కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. 12,13,14 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, లక్ష్మీ ఆరాధన ఉత్తమ ఫలితాలనిస్తాయి.

 

డా..ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios