Asianet News TeluguAsianet News Telugu

ప్రయాణాలు ఎప్పుడు చేయవచ్చు...?

కొన్ని కామితాలకోసం, నిత్య, నైమిత్తిక జీవనావసరాల కోసం, ఆధ్యాత్మికమైన లక్ష్యాలకోసం ప్రయాణాలు చేయడం కూడా సంప్రదాయంలో ఉంది.

astrology..right time to travel
Author
Hyderabad, First Published Sep 26, 2018, 3:52 PM IST

జీవితం అంటేనే ప్రయాణం. నిరంతర మానసిక, శారీరక సంచారం. ఈ సంచారం సరియైన దిశలో ప్రారంభమై, ఒడుదుడుకులుం లేకుండా సరియైన ప్రదేశంలో ముగించబడడమే జీవనలక్ష్యం అవుతుంది. మనస్సు శరీరం రెండూ ఏకీభవించి ప్రయాణానికి సిద్ధం కావాలి. లేకుంటే భావనల్లో ప్రయాణం చేస్తూ, ఊహాలోకాల్లో  మాత్రమే సంచరిస్తారు. శారీరకంగా చేయవలసిన పనులు చేయకుండా అర్ధాంతర ప్రయాణంలోనే జీవితాన్ని ముగిస్తారు. ప్రయాణం విషయంలో ఇది తాత్త్వికార్థం. అదేవిధంగా కొన్ని కామితాలకోసం, నిత్య, నైమిత్తిక జీవనావసరాల కోసం, ఆధ్యాత్మికమైన లక్ష్యాలకోసం ప్రయాణాలు చేయడం కూడా సంప్రదాయంలో ఉంది. వాటికి అనుకూలమైన ముహూర్తాలుం నిర్ణయించుకుని ప్రయాణించడం ద్వారా లక్ష్యాలను సాధించి, తక్కువ సమయంలో ఎక్కువ పనులుం పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

ప్రయాణాలు, వివిధ రకాలుంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలు, దూరప్రయాణాలు. ఏ కారణం వల్ల ప్రయాణం చేస్తామో ఆ కారణం వల్ల కూడా ప్రయాణ రకాలు ఆధరపడి ఉంటాయి. యుద్ధాలకి, వ్యాపారాలకి, ఉద్యోగనిమిత్తం, యాత్రలకు, వినోదాలకు ఈ విధంగా వివిధ రకాలుగా ప్రయాణాలుటాయి. నేలపై, నీటిపై, ఆకాశంపై కూడా ప్రయాణాలుం చేస్తుంటారు. పూర్వం ఇప్పుడున్నన్ని ప్రయాణసాధనాలు, సౌకర్యాలు లేవు. ప్రయాణాలలో శ్రమ, కష్టాలు ఉంటాయి. ప్రయాణాలతో శ్రమ, కష్టాలుం తగ్గానికి ప్రయాణాలు శుభప్రదంగా సౌఖ్యవంతంగా ఉండానికి చక్కని ముహూర్తం చూసి ప్రయాణం మొదలుప్టోలి. సర్వసాధారణంగా నిత్యం చేసే ప్రయాణాలకు ముహూర్త నిర్ణయం అవసరం లేదు.

తన గృహానికి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, భార్యతో కలహించినప్పుడు, భార్య రజస్వల అయినప్పుడు, శుభ కార్యాల నడుమ, జాతాశౌచం మధ్యలో, మృతాశౌచం మధ్యలో తాను జన్మించిన మాసానికి అష్టమ మాసమందు, మాతాపితరులుం మృతి చెందినపుడు సంవత్సరంలోపు, తల్లితండ్రుల శ్రాద్ధ దినానికి మరుసిరోజు, తన భార్య 6 మాసాలుం లేక ఆపైన గర్భంతో ఉన్నప్పుడు యాత్ర చేయరాదు. (కాలామృతం). కుటుంబ జీవనంలో ఇబ్బందులుం ఉండకూడదనే నియమంతోనూ, పితృకార్యాలన్నీ శ్రద్ధగా నిర్వర్తించాలని కాని తొందరల మధ్యలో కాదు అనే భావనలతో ఈ నియమాలను పూర్వీకులుం ఏర్పరచినారు. యాత్ర మధ్యలో మనస్సు చికాకు పొందకుండా కార్యసిద్ధి కలగాలనే భావం ఇందులో ఉంది. అంతే కాక దూరప్రాంతాలకు పూర్వం ప్రయాణం చేసే సందర్భంలో మళ్ళీ ఎంతకాలానికి వస్తారో తెలియని సందర్భంలోనూ ఇటువిం నియమాలుం అధికంగా కనిపిస్తున్నాయి. వీనిలోని కొన్ని అంశాలు అప్పికీ, ఎప్పికీ పాటించవలసినవే.

త్రివిధ నవమి : ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి అని 3 రకాల నవములు. తన ఇంటికి తిరిగి వచ్చిన తరువాత 9వ రోజున తిరిగి ప్రయాణం చేయరాదు. ఇది ప్రయాణ నవమి.

ప్రయాణం ప్రారంభించిన రోజు నుండి 9వ నాడు ఇంటికి తిరిగి రారాదు. ఇది ప్రవేశ నవమి.

నవమి తిథినాడు ప్రయాణం చేయరాదు. దీనిని ప్రత్యక్ష నవమి అని అంటారు.

తిథులుం : రిక్తతిథులు (చవితి, నవమి, చతుర్దశి) పంచపర్వతిథులు (బహుళ అష్టమి, బహుళ చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, సంక్రాంతి ప్రవేశతిథి) షష్టి, అష్టమి, ద్వాదశి, శుద్ధ పాడ్యమి, తిథులుం నిషిద్ధాలుం.

వారం : బుధ, గురు, శుక్ర వారాలుం సాధారణంగా ప్రయాణానికి మంచివి. సోమవారం కూడా మంచిదే

నక్షత్రములు : అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి ఈ నక్షత్రములు ప్రయాణమునకు ప్రశస్తములు.

రోహిణి, ఉత్తరఫల్గుణి, మూల, ఉత్తరాషాఢ, శతభిషం, ఉత్తరాభాద్ర నక్షత్రాలు మధ్యమాలు, తక్కిన నక్షత్రాలుం పనికిరావు.

లగ్నాలు : చర లగ్నాలు క్షేమాన్ని, ద్విస్వభావ లగ్నాలు రాజులకు శుభమును ఇస్తాయి. స్థిరలగ్నాలు ప్రయాణానికి తగినవి కావు.

డా.ఎస్ ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios