Asianet News TeluguAsianet News Telugu

హోరలు అంటే ఏమిటి..? మనపై వాటి ఫలితం ఎలా ఉంటుంది..?

వారం ఏర్పడడానికి హొరాక్రమం ఉంటుంది. ఆకాశంలో గ్రహాల వరుసల్లాగా ఉంటాయి. శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర హొ రలు. వరుసగా ప్రతిరోజూ అవే మళ్ళీ మళ్ళీ పునరావృత్తమౌతాయి.

astrology...how hora effected us
Author
Hyderabad, First Published Sep 17, 2018, 2:52 PM IST

మనం రోజును ఏ పేరుతో పిలుస్తామో దాన్ని ఆ వారంగా పరిగణిస్తాం. ఆది, సోమ, మంగళ,బుధ, గురు, శుక్ర, శని వారాల పేర్లతో 7 భాగాలుగా విభజింపబడుతుంది. వారం ఏర్పడడానికి హొరాక్రమం ఉంటుంది. ఆకాశంలో గ్రహాల వరుసల్లాగా ఉంటాయి. శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర హొ రలు. వరుసగా ప్రతిరోజూ అవే మళ్ళీ మళ్ళీ పునరావృత్తమౌతాయి.

ఈరోజు సోమవారం. సూర్యోదయం చంద్రహొరతో ప్రారంభం అవుతుంది. హొ ర అంటే ఒక గంట కాలం ఉంటుంది.  సూర్యోదయం తర్వాత ఒక గంట తరువాత చంద్రహొర అయిపోతుంది. తరువాత శని హొ ర వస్తుంది. క్రమంగా గురు, కుజ, రవి, శుక్ర, బుధ, మళ్ళీ చంద్ర హొ ర మధ్యాహ్నం 1-2 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 8-9 వరకు మళ్ళీ చంద్ర హొ ర ఉదయం 3-4 వరకు ఉంటుంది. ఈ విధానం మూడు సార్లు తిరగడం వళ్ల సూర్యోదయం నుండి 21 గంటలు పూర్తి అవుతాయి. తెల్లవారు ఉదయం 4-5 శనిహొర, 5-6 గురుహొర అయిపోయి మంగళవారం ఉదయం సూర్యోదయానికి  కుజహొ రతో వారం ప్రారంభం అవుతుంది. అందుకే ఆరోజును మంగళవారం అని పిలుస్తారు. ఈ విధంగానే వారాల క్రమం కూడా ఏర్పడుతుంది. ఈ కుజ హొ రలో శస్త్రచికిత్సలకు చేసుకోవానికి తప్ప ఇతర ఏ శుభకార్యాలకు పనికిరాదు. శస్త్ర చికిత్సలు కూడా తప్పనిసరి అయితే కాని లేకపోతే చంద్ర, బుధ, గురు, శుక్ర హొ రలు అన్ని శుభకార్యాలకు శ్రేష్ఠమైనవి.

రోజులో గంట గంటకూ మారే హొరలను జాగ్రత్తగా చూసుకుంటూ నూతన కార్యక్రమాలను ప్రారంభించే సమయంలో, ఎవరినైనా కలిసే సమయంలో, శుభ హొ రలలో కార్యక్రమాలను ప్రారంభించడం వల్ల శుభ ఫలితాలు కలిగి కార్యవిజయం సిద్ధిస్తుంది. ఈ హొ రలలో చేసే కార్యక్రమాలు ఈ విధంగా ఉండాలి.

రవి : దానాలు, అప్పీళ్ళు చేయడానికి, ఉత్తరాలు, దస్తావేజులకు, నోట్లు వ్రాయడానికి, సన్మానాలు కోరడానికి, కొనుటకు, తిరుగుటకు, ఉద్యోగం కొరకు అప్లికేషన్‌ పెట్టడానికి మంచిది. న్యాయమైన పనులకు, రాజకీయ వ్యవహారాలు, అధికారులను కలుసుకోవడానికి, ఉద్యోగ ప్రయత్నాలు వ్యవహారాలకు మంచిది.

చంద్ర: గృహారంభం, గృహప్రవేశం, నగలు ధరించడం, నూతన ఉద్యోగ ప్రవేశాలకు, వ్యవసాయారంభం, తోటలు పాతడానికి, స్త్రీ సౌఖ్యం పొందడానికి, గొప్పవారిని దర్శించడానికి, నీటి ప్రయాణం చేయడానికి, క్రొత్త పాత్రల్లో భుజించడానికి మంచిది. నౌకాయానం, వ్యాపారులు, ఉప్పు, ప్రతి, వెండి, కంచు, పశువులు, బెల్లం, పంచదార, మొదలైన తెల్లరంగు వస్తువులు కొనుటకు మంచిది.

కుజ : పాపగ్రహం, కష్టనష్టాలు, చిక్కులు కలుగుతుంటాయి. ఏ మంచి పని ఆరంభించకూడదు. విఘాతం, రక్తదర్శనం అవుతుంది. యుద్ధాలకు, సాహస కృత్యాలకు, భూ సంబంధమైన విషయాలు మ్లాడుకోవడానికి, సువర్ణ, తామ్ర, కంబళ, రస మొదలైన వస్తువులు కొనడానికి మంచిది. ఇందుకు సంబంధించిన వ్యాపారాలకు మంచిది.

బుధ : నూతన వర్తకం, దానికి సంబంధించిన వ్యాపారాలకు, విద్యకు సంబంధించిన పనులకు, సమస్త శుభ కార్యాలకు, దస్తావేజులు మొదలైన వ్రాత పనులకు మంచిది. నూతన వ్యాపారం, ఆటలు అప్పు తీర్చడం, ముద్రలు, సువర్ణ, వస్త్రాలు, ప్రతి, నూలు, చర్మం మొదలైన వ్యాపారాలకు మంచిది.

గురు : పిల్లలకు సంబంధించిన విషయాలు, ఉయ్యాలలో పెట్టడం, ముక్కు చెవులు కుట్టడానికి, అన్ని శుభాలకు, గొప్ప వారిని, పెద్దలను దర్శించి బహుమతులు పొందడానికి, అందించడానికి, ఉద్యోగ సంబంధమైన విషయాలు, బాకీలు వసూలు చేయడానికి, ఏ వస్తువైనా కొనడానికి, లాటరీ పజిల్స్‌ వేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి విద్యాసంబంధమైన  సర్వ కార్యాలకు మంచిది. వివాహం, ఉపనయనం, అప్పు తేవడం, తీర్చడం, గ్రంథరచన, ఉద్యోగంలో చేరడానికి మంచిది.

శుక్ర : సంబంధాలు నిశ్చయించడానికి, సంతకాలు పెట్టడానికి, ఔషధసేవకు, స్త్రీలతో మెలగడానికి, ప్రయాణాదులకు, నూతన వస్త్రాలు ధరించడానికి, సమస్త శుభకార్యాలకు, నిశ్చయ తాంబూలాలకు మంచిది. ఈ హొ రలో ఏవైనా కొనడం కంటే అమ్మడం మంచిది. నువ్వులు, నూనె, మినుములు, ఇనుము, నేతి వస్తువుల వ్యాపారానికి మంచిది.

శని : భూమి అమ్మడానికి చాలా మంచిది. తైల సంబంధ వ్యాపారాలకు శుభం. మిగతా ఏ వ్యాపారాలకు పనికి రాదు. మద్యశాలారంభం, చౌర్యం, పొగాకు, దున్నలకు కాడిగట్టడం, తైల వ్యాపారాలు, గానుగ వేయడం నీచ వృత్తికి మంచిది.

వేరు వేరు కార్యక్రమాలకు వేరు వేరు హొ రలు వేరు వేరు వారాలు శుభాశుభాలుగా ఉంటుటాంయి. పైన చెప్పిన విధంగా తాము ప్రారంభించే మంచి పనులకు ఎవరికి వారు ఆ రోజు ప్రారంభించే సమయం మంచిది అవునా కాదా చూసుకొని శుభహొ ర ఉన్న సమయంలో ఆ గంటలో ప్రారంభించి తరువాత దానిని కొనసాగించుకోవచ్చు. ప్రయాణాలు చేసే సమయంలో కూడా ఈ హొ రలను చూసుకొని ప్రయాణం చేయడం వల్ల గమ్యస్థానానికి సులువుగా ఏ ఆటంకాలు రాకుండా చేరుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios