Asianet News TeluguAsianet News Telugu

గృహ వాస్తు, సాధారణ దోషాలు...

కొన్ని వాస్తు సూత్రాలను మాత్రం తప్పకుండా పాటి ంచాలి. అలా కాకుండా శాస్త్రాన్ని అనుసరించకుండా కట్టడం వలన ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. భూ పరీక్ష దగ్గరినుంచి అన్నీ చూసుకుని మాత్రమే గృహ నిర్మాణం చేయాలి.

astrology.. gruha vasthu doshalu nivarana
Author
Hyderabad, First Published Sep 10, 2018, 3:38 PM IST

గృహ నిర్మాణం కొంత శ్రమతో కూడిన పని. ఎంత శ్రమతో కూడినదైనా నిపుణుల సహాయంతో దానిని ఆనందగా నిర్మించుకుని అందులో ఆనందమయ జీవనాన్ని సాగించవచ్చు. కాని కొన్ని వాస్తు సూత్రాలను మాత్రం తప్పకుండా పాటి ంచాలి. అలా కాకుండా శాస్త్రాన్ని అనుసరించకుండా కట్టడం వలన ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. భూ పరీక్ష దగ్గరినుంచి అన్నీ చూసుకుని మాత్రమే గృహ నిర్మాణం చేయాలి.

గృహం ఎక్కడ నిర్మించాలి, ఎక్కడ నిర్మించకూడదు ఎలాటి  వాటిని ఉపయోగించకూడదు అనే విషయాలను తెలుసుకోవడానికి కొన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం.

1. పర్వతాగ్రంలో గృహం నిర్మించరాదు.

2. పర్వతం క్రింద నిర్మించరాదు.

3. ద్వారాలు లేని గృహం నిర్మించరాదు.

4. అగ్నికి దగ్దాలైన కర్రలతో గృహం నిర్మించరాదు.

5. ఎత్తు తక్కువగా గల ఇల్లు నిర్మించరాదు.

6. రాత్రులందు చెవుల పిల్లుల ధ్వనులు వచ్చే చోట నిర్మించరాదు.

7. పెద్ద పెద్ద సర్పాలు నివసించే భూమిలో ఇల్లు నిర్మించరాదు.

8. పెద్ద బొరియలు గల నేలలో కట్టిన ఇల్లు దోషప్రదం.

9. పెద్ద పెద్ద బండలతో కట్టిన న ఇల్లు దోషప్రదం.

10. తలుపు మూసేటప్పుడు తీసేటప్పుడు శబ్దం వచ్చే ద్వారం గల ఇల్లు దోషం.

11. పర్వతాలు కలిసే చోట కట్టబడిన ఇల్లు దోషం.

12. ఒకే పెద్ద శిలపై నిర్మించబడిన గృహం దోషం.

13. గోడలు బీటలు తీసిన గృహం పనికిరాదు.

14. స్మశాన దూషిత గృహం పనికిరాదు.

15. నివాసం లేకుండా పాడుబడిన ఇల్లు దోషం.

16. నదిని ఆనుకొని ఒడ్డున క్టబడిన గృహం దోషం.

17. పర్వత శిఖరాల మధ్యలో కట్టబడిన గృహం దోషం.

18. ఉడుములు నివసించే గృహం దోషం.

ఈ విధంగా దోషాలు ఉన్న ఇంటిలో నివసించడం వల్ల అనారోగ్య, ధననష్ట, ప్రాణనష్టాలను సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి  జాగ్రత్త వహించడం మంచిది.

డా.ఎస్ ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios