Asianet News TeluguAsianet News Telugu

వాస్తు ప్రకారం ఇలా చేస్తే.. కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది..!

 జ్యోతిషశాస్త్రపరంగా మీ వృత్తిని  శని శాసిస్తుంది.  కాబట్టి ఈ నలుపు రంగు కాకులకు ఆహారం పెట్టడం వల్ల.. శని ప్రభావం తొలగి.. మీకు ఉద్యోగం పరంగా మంచి జరుగుతుంది.
 

Astrological remedies to get new job
Author
Hyderabad, First Published Jan 14, 2022, 1:37 PM IST

మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు చాలా మందే ఉన్నారు. కొందరికి ఎంత ప్రయత్నించినా... ఎంత కష్టపడినా.. ఉద్యోగం దొరకదు. అలాంటివారు..  జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని  పనులు చేయడం వల్ల..  ఉద్యోగం లభించే ఛాన్స్  ఎక్కువగా ఉంటుందట. మరి అవేంటో ఓసారి చూద్దాం..

శని ప్రభావం ఎక్కువగా ఉంటే... కొత్త ఉద్యోగాలు, ప్రమోషన్లు లభించవట. అందుకే శని దోషం కలగకుండా చూసుకోవాలట. అందుకోసం...  ఉడకపెట్టిన అన్నాన్ని.. శనివారం పూట కాకులకు పెట్టాలి. కాకులు ఎందుకు? ఎందుకంటే వారు శని గ్రహాన్ని సూచిస్తాయి. జ్యోతిషశాస్త్రపరంగా మీ వృత్తిని  శని శాసిస్తుంది.  కాబట్టి ఈ నలుపు రంగు కాకులకు ఆహారం పెట్టడం వల్ల.. శని ప్రభావం తొలగి.. మీకు ఉద్యోగం పరంగా మంచి జరుగుతుంది.

మీరు ఉదయాన్నే నిద్రలేవగానే, మీ అరచేతులను చూడండి, ఎందుకంటే ఇది సంపదను తీసుకురావడానికి ఉద్దేశించబడింది, ఎందుకంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, లక్ష్మీదేవి అందులో నివసిస్తుంది. కాబట్టి.. ప్రమోషన్ వచ్చే అవకాశం.. సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

విఘ్న వినాశక్ అని కూడా పిలువబడే గణేశుడిని ప్రసన్నం చేసుకునేందుకు బీజ్ మంత్రాన్నిజపించాలి. ఈ మంత్రం మీ కెరీర్‌లో ఉన్న అడ్డంకులను ఛేదిస్తుందని చెప్పబడింది.

ప్రతి శనివారం శని దేవాలయాన్ని సందర్శించండి.  ఆ శనివారాలు..  శని విగ్రహానికి నూనెను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించడంతోపాటు, పేదలకు నూనె , బూందీ సమర్పించండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి జ రుగుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios