డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

శ్రీ ప్లవ నామ సంవత్సర వైశాఖ ఆమావాస్య తేదీ 10 జూన్ 2021 గురువారం రోజు ఏర్పడే కంకణ సూర్యగ్రహణం మనకు వర్తించదు. గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. గర్భిణి స్త్రీలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. కల్పిత వదంతులు నమ్మకండి, అనవసమైన భయందోళనలు చెందకండి. మనకున్న అన్ని పంచాంగాలలో ఏ ఒక్క  పంచాంగ కర్త కూడా ఈ సంవత్సరం గ్రహణం ఉన్నదని ఎవరూ రాయలేదు కాబట్టి ప్రజలు నిశ్చింతగా ఉండండి. రోజు ఎలా ఉంటారో ఆ రోజు కూడా అలానే ఉండండి. 

ఆ రోజు గ్రహణం ఉన్నమాట వాస్తవమే కానీ మనది కాదు. ఇది కాలిఫోర్నియా, టెక్సాస్, సిడ్ని, దుబాయ్, సింగపూర్ లలో కనపడదు. 

న్యూయార్క్  మరియు లండన్ లో వృషభరాశి మృగశిర నక్షత్రంలో రాహుగ్రస్త కంకణ సూర్యగ్రహణం సంభవించును, కనిపిస్తుంది. 

న్యూయార్క్ లో పాక్షిక గ్రహణ సమయములు :- 

సూర్యోదయానికి ముందే గ్రహణం మొదలై , సూర్యోదయం తదుపరి పాక్షికంగా ముగియును.

గ్రహణ స్పర్శ ఉదయం 4:26 

సూర్యోదయం ఉదయం 5:30 నుండి కనబడును.

గ్రహణ మధ్యకాలం ఉదయం 5:33 

గ్రహణ ముగింపు ఉదయం 6:31 నిమిషాలు.


లండన్ లో పాక్షిక గ్రహణం :- 

గ్రహణ స్పర్శ  ఉదయం 10:09.

గ్రహణ మధ్యకాలం మధ్యాహ్నం 11:13 .

గ్రహణ ముగింపు మధ్యాహ్నం 12:23 వరకు.