మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ఆకస్మిక ఇబ్బందుల ఉంటాయి. అనారోగ్య సూచన ఉంటుంది. క్రయ విక్రయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. అనుకోని ఇబ్బందులు ఉంటాయి. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వాములతో సంతోషం ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఉత్తేజం పెరుగుతుంది. పదిమందిలో గౌరవం పెరుగుతుంది.  నష్టవస్తు పరిజ్ఞానం పెంచుకుటాంరు. సంతృప్తి. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. శతృవులపై విజయానికి ఒత్తిడి అధికం. రోగ నిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఊహించని ఒత్తిడులు ఉంటాయి. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంతాన సమస్యలు తగ్గుతాయి. సృజనాత్మక పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయలు పెరుగుతాయి. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. సౌకర్యాలపై దృష్టి పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఖర్చులు పెట్టే సూచనలు. గృహంకోసం ఆలోచన ఉంటుంది. మృష్టాన్నభోజనం కోసం ప్రయత్నిస్తారు. విద్యార్థులకు కష్టకాలం. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పెద్దల సహకారంకోసం ప్రయత్నిస్తారు. తోటి ఉద్యోగులతో అననుకూలత ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ వల్ల జాగ్రత్త అవసరం. ప్రసార ప్రచార సాధనాల్లో అప్రమత్తత అవసరం. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వాగ్దానాలు నెరవేరుతాయి. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతృప్తి ఉంటుంది. సంపాదనకు ప్రయత్నిస్తారు. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శారీరక శ్రమ అధికం. అనుకున్న పనుల్లో లోపాలు ఉంటాయి. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకునే ప్రయత్నం చేయాలి. పట్టుదలతో కార్యసాధన అవసరం. సుఖదుఖాలు అనుకున్న స్థాయిలో ఉంటాయి. జాగ్రత్తలు అవసరం. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసర ఒత్తిడులు ఏర్పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అన్ని రకాల ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు.శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. నిల్వధనం పెంచుకుటాంరు. ఆదర్శవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేస్తారు. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం కోసం పాటు పడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం. ఉద్యోగులతో అసౌకర్యం ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. పనులలో సంతోషం లభిస్తుంది. శ్రీరామ జయరామజయజయరామరామ జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ