ఐటీ గ్రిడ్ కంపనీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఓటర్ల డాటాను సేకరించి అవకతవకలకు పాల్పడటం ద్వారా టిడిపి లబ్ధి పొందే ప్రయత్నం చేసిందని ప్రతిపక్షం వైఎస్సార్‌సిపి ఆరోపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి ఈ డాటా చోరీ వ్యవహారంలో ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్ హస్తం వుందని ముందునుంచి ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో ఆయన లోకేశ్ పై మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

ఇలా విజయసాయి రెడ్డి తాజాగా లోకేశ్ పై మరోసారి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. '' డేటా చోరీ కేసులో అడ్డంగా దొరికిన తర్వాత పప్పు నాయుడు బంకర్ లో దాక్కున్నాడా? ఎవరికీ కనిపించకుండా ఎటు వెళ్లాడు? అజ్ణాతంలో లేక పోతే మీడియా ముందు మాట్లాడాలి. మంత్రిగా జీతభత్యాలు తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో లేకుండా ట్విట్టర్ మ్యాన్ అయిపోతే ఎలా?'' అంటూ ట్వీట్ చేశారు. 

మరో ట్వీట్ లో '' ఐటీ గ్రిడ్ క్లోజయినప్పటి నుంచి చిట్టి నాయుడు మెదడులో అమర్చిన ‘చిప్’ సిగ్నల్స్ తీసుకోవడం లేదట. ‘ERROR’ చూపిస్తోంది. అందుకే వారం రోజులుగా అజ్ణాతంలోకి పంపించాడు పెద్ద నాయుడు. డేటా దొంగ అశోక్ ప్రస్తుతం చిప్ ను యాక్లివేట్ చేసేందుకు విఫలయత్నం చేస్తున్నాడు.'' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.