టీడీపీ చాలా పెద్ద నేరానికి పాల్పడిందన్నారు. ఐటీ గ్రిడ్స్ స్కాంపై ఎన్నికల సంఘం సీరియస్ గా వ్యవహరించాలని కోరారు. ఐటీ గ్రిడ్స్ స్కాంలో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ హస్తం ఉందన్నారు. ఈ స్కాం ప్రజాస్వామ్యంపై, ప్రజల ప్రాథమిక హక్కులపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
కడప: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య. చంద్రబాబు ఏపీకి పట్టిన గ్రహణమంటూ మండిపడ్డారు. సోమవారం కడపజిల్లాలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సి.రామచంద్రయ్య రాష్ట్ర ప్రజల సమాచారాన్ని టీడీపీ ఐటీ కంపెనీలకు ధారదత్తం చేసిందని ఆరోపించారు.
టీడీపీ చాలా పెద్ద నేరానికి పాల్పడిందన్నారు. ఐటీ గ్రిడ్స్ స్కాంపై ఎన్నికల సంఘం సీరియస్ గా వ్యవహరించాలని కోరారు. ఐటీ గ్రిడ్స్ స్కాంలో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ హస్తం ఉందన్నారు. ఈ స్కాం ప్రజాస్వామ్యంపై, ప్రజల ప్రాథమిక హక్కులపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
కొత్త పంథాలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆయా కంపెనీల ఉద్యోగులకు జీతాలు ఎవరిస్తున్నారో, వారికి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుందో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెట్టే సంస్కృతి ఏపీలో నెలకొనడం దురదృష్టకరమన్నారు.
చంద్రబాబుది క్రిమినల్ మైండ్ అనడానికి ఐటీ గ్రిడ్స్ ఉదంతమే నిదర్శనమన్నారు. కాగ్ తప్పుపట్టినా, ప్రతిపక్షం ప్రశ్నించినా, జనాలు ఛీకొడుతున్నా చంద్రబాబు అక్రమాలు మాత్రం ఆపడం లేదన్నారు. చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు.