వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలనే కసితో వైసీపీ అధినేత జగన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మొన్నటి వరకు పాదయాత్ర చేసి.. ప్రజలతో మమేకమైన ఆయన.. ఇప్పుడు మరో ప్రస్థానానికి శ్రీకారం చుడుతున్నారు.

ఒకవైపు నేతలతో మంతనాలు జరుపుతూ.. ఆకర్ష్ పేరిట అధికార పార్టీలోని నేతలను తనవైపు తిప్పుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు మరో నూతన ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. త్వరలో జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు.

పాదయాత్రలో కవర్ అవ్వని ప్రాంతాలను లిస్ట్ అవుట్ చేసి.. ఆ ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆయన తన పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.  ఈ బస్సు యాత్ర ద్వారా మరికొంత మంది ప్రజలను కలిసి.. ఎన్నికలల్లో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. ఈ బస్సు యాత్రలో జగన్ తో పాటు కీలక నేతలు కొందరు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో రెండు, మూడురోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.