నెల్లూరు: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో వైసీపీ సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ ఎన్నికలు సమీపిస్తున్న తరునంలో చంద్రబాబు  నాయుడు నక్క జిత్తులకు పాల్పడతారంటూ ధ్వజమెత్తారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే అందుకు ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 36 గంటల ముందు లగడపాటి తెరపైకి వచ్చారని చెప్పుకొచ్చారు. సర్వేతో ప్రజలను ప్రలోభ పెట్టేందుకు నానా హంగామా చేశారంటూ చెప్పుకొచ్చారు. 

టీఆర్ఎస్ ఓడిపోతుంది కేసీఆర్ ఇంటికి వెళ్లిపోతున్నాడు అటూ తెగ ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారని గుర్తు చేశారు. అయితే ఎన్నికలు వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసిందన్నారు. 

ఎవరు వెళ్లిపోయారో, ఎవరు సీఎం అయ్యారో ప్రజలకు తెలుసు అన్నారు. ఇలా సర్వేల పేరుతో చంద్రబాబు నాయుడు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి జిత్తుల మారి నక్క ఎత్తులను ప్రజలు నమ్మెుద్దు అని హితవు పలికారు. 

చంద్రబాబు ఇంటిలిజెన్స్ అధికారులను సైతం తన సొంత పనులకు, పార్టీ పనులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రతీ గ్రామం తిరుగుతూ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ జగన్ ధ్వజమెత్తారు. 

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ దారుణమైన స్థితిలో ఉందన్నారు. పోలీసులను చూస్తే జాలేస్తుందని ఆరోపించారు. పోలీసులు మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలి కానీ ఆ మూడు సింహాల వెనుక ఉన్న నక్కలకు సెల్యూట్ కొట్టాల్సిన దుస్థితి నెలకొందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

 ఈ వార్తలు కూడా చదవండి

రాజధాని గురించి అడిగితే బాహుబలి గ్రాఫిక్స్ గురించి చెప్తున్నాడు: చంద్రబాబుపై జగన్ మండిపాటు 

డేటా చోరీ చేసిన గజదొంగ చంద్రబాబు: వైఎస్ జగన్

ఓట్లను తొలగిస్తున్నారు, చంపేందుకు కూడా వెనుకాడరు: బాబుపై జగన్