Asianet News TeluguAsianet News Telugu

మానాన్న చనిపోయాకే కేసులు పెట్టారు ఎందుకంటే.....:జగన్ వ్యాఖ్యలు

తనపై కేసులు పెట్టడం వెనుక పెద్ద కుట్రే ఉందని ఆరోపించారు. తన తండ్రి చనిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీని కాదని ఓదార్పుయాత్ర చేపట్టినప్పుడు కేసులు పెట్టారంటూ ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తనపై కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. 

ys jagan expalain  on his assets cases
Author
Delhi, First Published Mar 2, 2019, 2:18 PM IST

ఢిల్లీ: తనతండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నంతకాలం తనపై ఎలాంటి కేసులు లేవని వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇండియాటుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్ లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ ముఖాముఖిలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తనపై కేసులు పెట్టడం వెనుక పెద్ద కుట్రే ఉందని ఆరోపించారు. తన తండ్రి చనిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీని కాదని ఓదార్పుయాత్ర చేపట్టినప్పుడు కేసులు పెట్టారంటూ ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తనపై కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. 

తనతండ్రి చనిపోయిన తర్వాత ఆ మహానేత మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చాలన్న ఉద్దేశంతో తాను ఓదార్పుయాత్ర చేపట్టానని అయితే అందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదన్నారు. 

కాంగ్రెస్ పార్టీతో విబేధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత కేసులతో వేధించారని తెలిపారు. తన తండ్రి మంచి పరిపాలన అందించారు కాబట్టే 2009 లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. అలాంటి పాలన తాను అందిస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నేనే సీఎం అయితే.., నా శత్రువు.. జగన్ కామెంట్స్ (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios