ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. మరో వారంలో నామినేషన్ల పర్వం కూడా మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి జంప్ చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేయగా.. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

మదనపల్లి ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి.. టీడీపీలోకి జంప్ చేయాలని చూస్తున్నారని సమాచారం. మదనపల్లి వైసీపీ టిక్కెట్ మైనారిటీ నేతకు ఖరారు చేశారని ప్రచారం జరుగుతుండడంతో.. ఆయన మంగళవారం తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు.
 
ఇక ఇటీవల వైసీపీని వీడిన వంగవీటి రాధా బుధవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. నిన్న రాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి చంద్రబాబును కలిసిన వంగవీటి రాధా టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు