ఏపీలోని చాలా మంది ఓటర్ల సమాచారం లీకయ్యిందనే వార్తలు ప్రస్తుతం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. 

ఏపీలోని చాలా మంది ఓటర్ల సమాచారం లీకయ్యిందనే వార్తలు ప్రస్తుతం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కాగా..దీనిపై వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఉండాల్సిన డేటా ఎలా లీకయ్యిందని ప్రశ్నించారు.

ఈ సమాచారం అంతా ప్రగతి కోసం అని మంత్రి లోకేష్ అంటున్నారనీ, వైఎస్సార్‌సీపీకి చెందిన వారి ఓట్ల తొలగింపు కూడా వీరి కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. సర్వేల పేరుతో ఓటర్ల సమాచారం సేకరించారని తెలిపారు. ఓటర్లను నాలుగు భాగాలుగా విభజించి ఓట్ల తొలగింపు చేపట్టారని, ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేని వారి ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు.

గతంలో ప్రభుత్వ టీచర్లు ఓటర్ నమోదు, తొలగింపు కార్యక్రమాలు చేపట్టేవారని.. కానీ ప్రస్తుతం అంగన్ వాడీలతో కూడా చేయిస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల ఒత్తిడితో అంగన్ వాడీలతో ఈ పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. 

చట్ట ప్రకారం ఎక్కడ నేరం జరిగితే అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారని .. . కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం హైదరాబాద్‌లో నేరం జరిగినా ఏపీలోనే దర్యాప్తు చేస్తానంటారని మండిపడ్డారు. ఓటర్ల లిస్ట్ నుంచి మీకు నచ్చని ఓటర్లను తొలగించేందుకు యంత్రాంగం తయారు చేశారని ఆరోపించారు. 

 విచారణ జరుపుతుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ నేతలు ప్రైవేటు సంస్థలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.