త్వరలో ఎన్నికలు మొదలు కానున్న నేపథ్యంలో.. ఏపీలో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అప్రమత్తమౌతోంది. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.
త్వరలో ఎన్నికలు మొదలు కానున్న నేపథ్యంలో.. ఏపీలో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అప్రమత్తమౌతోంది. ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఇందులో భాగంగా.. వైసీపీ నేతలు ప్రత్యేకంగా పార్టీ జెండాలు.. పార్టీ గుర్తుతో బైక్ లను తయారు చేయిస్తున్నారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ప్రచారాల కోసం ఆ బైక్‌లను వినియోగించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహలోనే మోటార్ సైకిళ్లను వినియోగించారు. ఇప్పుడు బీజేపీ అడుగుజాడల్లోనే వైసీపీ కూడా నడుస్తూ ప్రతి నియోజకవర్గానికి 20 బైక్‌లు పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.
పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇలా చేస్తోంది. బైక్ లను, పార్టీ జెండాలను నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు పంపి.. వాటితో విస్తృతంగా ప్రతిగ్రామంలో పర్యటన చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.