Asianet News TeluguAsianet News Telugu

‘టీవీ5’ పై వైసీపీ నిషేధం

ప్రముఖ న్యూస్ ఛానెల్ ‘టీవీ5‘ పై ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ నిషేధం విధించింది. 

ycp ban on TV5 media channel
Author
Hyderabad, First Published Mar 8, 2019, 12:54 PM IST

ప్రముఖ న్యూస్ ఛానెల్ ‘టీవీ5‘ పై ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ నిషేధం విధించింది. ఆ ఛానెల్ లో నిరంతరం టీడీపీ కార్యక్రమాలు, ఆ పార్టీని పొగుడుతూ ప్రోగ్రామ్స్, చర్చా వేధికలు చేపడుతున్నారనే ఆ ఛానెల్ పై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఆ చానల్‌ నిర్వహించే చర్చవేదికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తమ పార్టీ తరఫున ఏ ఒక్కరు కూడా టీవీ 5 చానల్‌ చర్చావేదికలకు వెళ్లరాదని పేర్కొంది. తమ పార్టీ వారిని చర్చలకు ఆహ్వానించరాదని టీవీ 5కి కూడా సూచించింది. అంతేకాకుండా వైసీపీ  ప్రెస్‌మీట్లకు, పార్టీ కార్యక్రమాలకు టీవీ 5ని నిషేధిస్తున్నట్టు వెల్లడించింది.

స్వతంత్ర మీడియా ముసుగులో ఎల్లో మీడియాగా మారిన వారిని బట్టబయలు చేసేందుకే వై సీపీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. కాగా, గతంలో ఏబీఎన్‌ చానల్‌పై కూడా వైసీపీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios