శనివారం రాత్రి చిత్తూరు నుంచి కాచిగూడకు బయలుదేరిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కర్నూలు స్టేషన్‌లో ఇంజిన్ పట్టాలు తప్పింది. 

చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. శనివారం రాత్రి చిత్తూరు నుంచి కాచిగూడకు బయలుదేరిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కర్నూలు స్టేషన్‌లో ఇంజిన్ పట్టాలు తప్పింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. గాఢనిద్రలో ఉండగా రైలు కుదుపులకు లోను కావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ సహాయక సిబ్బంది... ఘటనాస్థలికి చేరుకుని ట్రాక్ మరమ్మత్తులు చేపట్టారు.

రైలుకు మరో ఇంజిన్ తగిలించి కాచిగూడకు పంపారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.