జనసేన అధినేత పవన్ కల్యాణ్ కడప జిల్లా పర్యటనలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. పోరాట యాత్రలో భాగంగా ఆయన గత రెండు రోజులు కడప జిల్లాలో పర్యటించారు.
కడప: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కడప జిల్లా పర్యటనలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. పోరాట యాత్రలో భాగంగా ఆయన గత రెండు రోజులు కడప జిల్లాలో పర్యటించారు.
గురువారం నాడు జిల్లా పర్యటనలో భాగంగా రాజంపేట మండలం ఉటుకూరు వద్ద పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సమయంలో ఓ ద్విచక్రవాహనం వెంకట రాజు (60)ను ఢీకొంది. ఈ ఘటనలో వెంకటరాజు కుడి కాలు నుజ్జునుజ్జు అయ్యింది.
అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు అత్యవసర చికిత్సకై గాయపడిన వ్యక్తిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు.
