వైసీపీ తొలి జాబితా మరికొద్దిసేపట్లో విడుదల కానుంది. ఉదయం 10.30గంటలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. 70 నుంచి 80 మందితో తొలి జాబితాను విడుదల చేయనున్నారు. 

అలాగే పార్టీలో చేరికలను బట్టి రెండు మూడు రోజుల్లో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. 20 నుంచి 40 మంది అభ్యర్థులతో వైసీపీ రెండో జాబితా విడుదల కానుంది. 

కాగా... జాబితా ప్రకటన పూర్తయిన తర్వాత ఇడుపులపాయకు జగన్‌ వెళ్లనున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల ప్రచారాన్ని జగన్‌ ప్రారంభించనున్నారు.