తెలంగాణ మహిళకు.. ఏపీలో ఘన సత్కారం జరిగింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెకు ఈ పురస్కారం అందించారు. తమ కళాశాలలో చదువుకుని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్‌గా గెలుపొందిన సందర్భంగా ఆమెకు ఈ సత్కారం అందింది.

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరుకు చెందిన బెక్కెం శ్రీలత ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించారు. ఇందుకుగానూ గతంలో ఆమె చదువుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శ్రీలతను ఘనంగా సత్కరించారు.

మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మరికొంత మంది మహిళలనూ కళాశాల తరపున సన్మానించారు.