ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. అనంతపురంలో ఓ సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేశారు. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, ఐడీసీ మాజీ ఛైర్మన్ నలపరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

ఈ విషయాన్ని ఆయన అధికారికంగా  ప్రకటించారు. అయితే.. ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ఆయన స్పందించారు. తన సన్నిహితులతో చర్చించి.. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

కాగా.. రాప్తాడు నియోజకవర్గం నుంచి మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. నల్లపరెడ్డి రాజీనామాతో ఆ నియోజకవర్గంలో టీడీపీ ఓటు బ్యాంకుకు కొంత గండిపడే అవకాశం ఉందని తెలుస్తోంది.