టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీకి ఫోన్ వేధింపులు ఎక్కవయ్యాయి. పలువురు యామనికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. 


టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీకి ఫోన్ వేధింపులు ఎక్కవయ్యాయి. పలువురు యామనికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. దీంతో.. ఆమె పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

యామిని పీఆర్వో పొట్లూరి వెంకట సుధీర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె సెల్‌ నెంబర్‌ను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి, ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వరకు ఫోన్లు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు సుధీర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఫేస్‌బుక్‌లో మార్ఫింగ్‌ ఫొటోలతో పాటు అసభ్యకర పదజాలంతో పోస్టింగ్స్‌ పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విధంగా చేస్తున్న వారిలో కొందరిని గుర్తించి వారి పేర్లను ఫిర్యాదులో పొందుపరిచారు. 

వైసీపీ ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్‌ కలకాల, మానుకొండ రామిరెడ్డి, వైఎస్సార్‌ అశోక్‌, కామిరెడ్డి రాము, మధుసూదనరెడ్డి, లక్ష్మీసుజాత, తదితరులతో పాటు మరికొందరు ఇందుకు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.