సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీంతో..ఈ ఎన్నికలకు మేము కూడా రెడీ గా ఉన్నామంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అభ్యర్థుల జాబితా కూడా రెడీ చేసినట్లు ప్రకటించింది. తొలి విడత జాబితాలో 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ పేర్కొంది. 

ఈ మేరకు పవన్‌కల్యాణ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఇందులో తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల స్థానాలు ఉండే అవకాశం ఉంది. ఈ జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. ఈ వచ్చే ఎన్నికల్లో జనసేన వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. అభ్యర్థుల విషయంలో వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమకు 26 శాసనసభ, 4 లోకసభ స్థానాలను కేటాయించాలని వామపక్షాలు జనసేన  అధినేతను కోరుతున్నట్లు తెలుస్తోంది.