Asianet News TeluguAsianet News Telugu

యుద్ధంపై కామెంట్స్.. పాకిస్తాన్ మీడియాలో పవన్ హైలెట్

భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతుందని రెండేళ్ల క్రితమే తనకు తెలుసూ అంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 

pak media dawn story on pawan kalyan comments
Author
Hyderabad, First Published Mar 1, 2019, 3:58 PM IST

భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతుందని రెండేళ్ల క్రితమే తనకు తెలుసూ అంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో యుద్ధం జరిగుతుందని రెండేళ్ల క్రితమే తనతో బీజేపీ నేతలు చెప్పారని పవన్ అన్నారు. కాగా.. కామెంట్స్ ఇప్పుడు మనదేశంతోపాటు.. పాకిస్తాన్ లో కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థ "డాన్" తన వెబ్‌సైట్‌లో ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి క్లుప్తంగా సమాచారం ఇస్తూ మనదేశానికి చెందిన ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని లింక్ చేసింది.

కడప జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు డాన్ వెబ్‌సైట్ లింక్ చేసిన భారతీయ మూల ఇంగ్లీష్ వెబ్‌సైట్ కథనం పేర్కొంది. అంతేగాక పవన్ కల్యాణ్‌కు గతంలో బీజేపీతో సంబంధాలున్నాయని కూడా తెలిపింది. బీజేపీ నేతలు మాత్రమే దేశభక్తులన్నట్లుగా చెప్పుకుంటున్నారని, దేశభక్తి కేవలం బీజేపీ హక్కు కాదని, వారికంటే తాము 10 రెట్లు దేశభక్తులమని పవన్ పేర్కొన్నట్లు ఆ కథనం వెల్లడించింది.

కాగా.. పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశంలో కూడా రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. పవన్ చేసిన కామెంట్ల పై కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios