సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు... టీడీపీని వీడి.. వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. వైసీపీలో చేరిన ఆయనకు ఇప్పుడు కీలక పదవి దక్కింది. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. ఈ విషయాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితేష్‌ కూడా వై సీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఈసారి ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ని ఎలాగైనా గెలిపించుకోవాలని పార్టీలో  చేరిన సందర్భంగా నార్నె శ్రీనివాసరావు అన్నారు. ఫిబ్రవరి 28న ఆయన వైసీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం నుంచి తాను ఆ కుటుంబానికి మద్దతుదారుడిగా ఉన్నానని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు పాలన బాగా లేదని వ్యాఖ్యానించారు.