కేంద్రం తీరును చూస్తే ఆదాయాన్ని తెచ్చే తలను తీసేసి, ఏడాదికి రూ.500 కోట్లు రాని ప్రయాణికుల ఆదాయం అనే మొండాన్ని మిగిల్చారంటూ విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్క్ మోసం మరోసారి తేట తెల్లమైందన్నారు. గతంలో రాష్ట్ర విభజనలో ఏపీకి ఎలా అన్యాయం జరిగిందో రైల్వేజోన్ ఏర్పాటులోనూ అంతే అన్యాయం జరిగిందన్నారు.
అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెదవి విరిచారు. రైల్వే జోన్ ప్రకటించడం ఒక కుట్ర అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్తేర్ డివిజన్‌లో కేవలం సరకు రవాణా ద్వారా ఏడాదికి రూ.6,500 కోట్లు ఆదాయం వస్తుందని దాన్ని రాయగఢకు తరలించడం అన్యాయమేనన్నారు.
కేంద్రం తీరును చూస్తే ఆదాయాన్ని తెచ్చే తలను తీసేసి, ఏడాదికి రూ.500 కోట్లు రాని ప్రయాణికుల ఆదాయం అనే మొండాన్ని మిగిల్చారంటూ విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్క్ మోసం మరోసారి తేట తెల్లమైందన్నారు. గతంలో రాష్ట్ర విభజనలో ఏపీకి ఎలా అన్యాయం జరిగిందో రైల్వేజోన్ ఏర్పాటులోనూ అంతే అన్యాయం జరిగిందన్నారు.
అప్పుడు ఆదాయం ఉన్న హైదరాబాద్ తెలంగాణకి ఇచ్చేశారని ఇప్పుడు రూ.6,500 కోట్లు తెచ్చే వాల్తేర్ డివిజన్‌ని ఒడిశాకి కట్టబెట్టారంటూ ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ అంటే నమ్మించి మోసం చెయ్యడం అంటూ కొత్త అర్థాన్ని ఇచ్చారు.
నరేంద్ర అంటే నమ్మించడం, మోడీ అంటే మోసం చేసేవారంటూ ఎద్దేవా చేశారు. రైల్వే జోన్ ప్రకటనతో మరోసారి రుజువైందన్నారు. బిడ్డ(విశాఖరైల్వే )కు జన్మనిచ్చి తల్లి(వాల్తేర్ డివిజన్ )ని మోడీగారు చంపేశారంటూ ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి