పండుల రవీంద్రబాబు.. మళ్లీ టీడీపీలోకి అడుగుపెట్టనున్నారా..? అవుననే సమాధానమే వినపడుతోంది. నెల రోజుల క్రితం అమలాపురం ఎంపీ టీడీపీ కి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

అయితే..ఆయన తిరిగి మళ్లీ టీడీపీలోకి రావాలని అనుకుంటున్నారట.  వైసీపీలో కోరుకున్న టికెట్ దక్కుతుందనే ఆశతో అందులో చేరారు. అయితే.. ఆ అవకాశం జగన్ పండుల రవీంద్రబాబుకి ఇవ్వలేదట.

దీంతో.. తిరిగి మళ్లీ టీడీపీలోకి వస్తానంటూ టీడీపీ పెద్దలతో అన్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు టీడీపీ పెద్దలతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. మళ్లీ పార్టీలోకి రావాలనుకుంటున్న అతని కోరికను చంద్రబాబు మన్నిస్తారో లేదో చూడాలి.