సినీ నటుడు, ఎంపీ మురళీ మోహన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు షాకింగ్ గా ఉన్నాయి. కేసీఆర్ విషయంలో చంద్రబాబుకే.. మురళీ మోహన్ కౌంటర్ ఇవ్వడం గమనార్హం.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. వచ్చే ఎన్నికల్లో మురళీ మోహన్ పోటీ చేయాలని అనుకోవడం లేదు. ఈ విషయాన్ని చంద్రబాబుకి స్వయంగా వివరించారు. దీంతో.. వేరేఅభ్యుర్థిని వెతికే పనిలో పడ్డారు చంద్రబాబు. అయితే.. తనతోపాటు తన కోడలు రూప కూడా పోటీ చేయదని గతంలో మురళీ మోహన్ చెప్పారు.

అయితే.. ఈ విషయంపై బుధవారం తాజగా మాట్లాడారు. తన కోడలు రూప పోడీపై తాను ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఒక వేళ రూప పోటీచేస్తే... తన తరపున పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.  అనంతరం చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు.

ఇటీవల పలువురు సినీ నటులు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. వాళ్లని కేసీఆర్ భయపెట్టడం మూలానే.. టీడీపీ ని కాదని వైసీపీలో చేరారంటూ చంద్రబాబు కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన మురళీ మోహన్.. అది అంతా అవాస్తవం అన్నారు. సినిమా వాళ్లని కేసీఆర్ భయపెడుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదని తేల్చేశారు.  ఒకరు భయపెడితే.. సినిమా వాళ్లు భయపడరు అని చెప్పారు.