ప్రముఖ మీడియా ఛానెల్ సాక్షికి ఏపీ మంత్రి లోకేష్  కౌంటర్ ఇచ్చారు. కాగా కౌంటర్ ట్వీట్  ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ మ్యాటరేంటంటే.. మంత్రి గంటా శ్రీనివాసరావు.. తనకు టికెట్ దక్కలేదనే కారణంతో అలక బూనారు అంటూ.. సాక్షి టీవీలో వార్త హల్ చల్ చేసింది. దీనిపై లోకేష్ వెరైటీగా స్పందించారు.

వెంటనే ఈ విషయంపై గంటాతో చర్చలు జరిపిన లోకేష్.. ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. గంటాతో ఫోటో దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘అవును నిజమే.. గంటా శ్రీనివాసరావు గారి ముఖంలో అలక చూడండి.’ అంటూ ఇద్దరూ నవ్వుతూ ఉన్న ఫోటోను షేర్ చేశారు. ‘అవినీతి డబ్బా ... అవినీతి పత్రిక’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాకుండా.. ఫేక్‌న్యూస్ సాక్షి, ఫేక్ టీవీ, ఫేక్ లీడర్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లను జత చేశారు.

కాగా.. గంటా, లోకేష్ దిగిన ఫోటోలో.. సాక్షి ఛానెల్ లో గంటా విజువల్ తో పాటు.. ఆయన అలిగారు అంటూ స్క్రోలింగ్ కూడా  కనపడుతూ ఉండటం విశేషం.