ఏపీ మంత్రి లోకేష్.. మరోసారి ప్రతి పక్ష పార్టీ వైసీపీ పై మండిపడ్డారు. ఏపీలో టీడీపీ నేతలు దొంగ ఓట్లు క్రియేట్ చేసి.. వైసీపీ మద్దతు దారుల ఓట్లను తొలగిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసి.. వారి సహాయంతో ఓట్లు తొలగింపు కార్యక్రమం కూడా చేపట్టారు. 

కాగా.. దీనిపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘బీహార్ గ్యాంగ్ డైరెక్షన్ లో దొంగ అబ్బాయి చీప్ పాలిట్రిక్స్ మొదలుపెట్టారు! ప్రజాక్షేత్రంలో @jaitdp పార్టీని ఎదుర్కునే దమ్ము లేక వైకాపా దద్దమ్మ పనులు చేస్తుంది’’ అంటూ లోకేష్ మండిపడ్డారు.

మరో ట్వీట్ లో ‘‘అభివృద్ధి-సంక్షేమం లో పోటీ పడలేం అని డిసైడైన జగన్ మోడీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.  గంపగుత్తగా టీడీపీ ఓట్లు తొలగించాలి అని స్కెచ్ వేసిన వైకాపా పార్టీని ప్రజలు ఎన్నికల్లో గంపగుత్తగా ఇంటికి పంపడం ఖాయం !!!’’ అని పేర్కొన్నారు.