విజయవాడ: డేటా చోరీ కేసుపై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్న డేటా చోరీకి కారణం తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల సంఘం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2015లోనే ఓట్ల తొలగింపు ప్రక్రియకు, డేటా చోరీకి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ తెరలేపారంటూ ధ్వజమెత్తారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు తొలగింపు ప్రక్రియలో కేసీఆర్ ముద్దాయి కాబోతున్నారని, దేశంలో ప్రధాని నరేంద్రమోదీ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళనతో టీఆర్ఎస్ పార్టీ ఆవ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఐటీ గ్రిడ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారంటూ హీరో శివాజీ వ్యాఖ్యానించారు. 
 
సమగ్ర కుటుంబ సర్వే, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సమాచారన్ని ఆధారంగా చేసుకుని ఓట్లు తొలగించే హక్కు మీకు ఎవరిచ్చారంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఓట్లు తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చేసిందని ఆరోపించారు. 

డేటా చోర్యం చేసింది తెలంగాణ ప్రభుత్వం అయితే దొంగే దొంగ అన్న చందంగా ఉందన్నారు. దొంగతనం చేసిన కేసీఆర్ ఏపీపై విరుచుకుపడతారా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను చంపేశారంటూ విరుచుకుపడ్డారు. 

కేసీఆర్ ఏపీని నాశనం చేసేలా, అవమానించేలా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాము కేసీఆర్ ను ఎన్నుకున్నామని అలాంటి వ్యక్తి ఆంధ్రోళ్లు దొంగలు అంటూ వ్యాఖ్యానిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ అన్నాన్ని అవమానించారని, బిర్యానీని తిట్టారంటూ విరుచుకుపడ్డారు. 

తమ బిర్యానీ పేడలా ఉంటుందా అంటూ హీరో శివాజీ మండిపడ్డారు. తాను ప్రెస్మీట్ పెట్టేందుకు బయలు దేరుతుంటే తన భార్య తనను పట్టుకుని ఏడ్చిందని, చేతులు పట్టుకుని ప్రెస్మీట్ పెట్టొద్దంటూ వేడుకుందని చెప్పుకొచ్చారు. అంటే తెలంగాణలో కేసీఆర్ ను చూసి భయపడాలా అంటూ విరుచుకుపడ్డారు. 

తాము ఓటేసి ఎన్నుకున్న వ్యక్తి కేసీఆర్ అని, ఒక ప్రజాప్రతినిధిగా తమను ఇలా బెదిరిస్తారా తమాషాలు చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా విరుచుకుపడ్డారు హీరో శివాజీ. 

హైదరాబాద్ రావడానికి ఆంధ్రపోలీసులకు హక్కు ఎక్కడిది అంటూ నిలదీయడాన్ని మండిపడ్డారు. హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని అని అలాంటిది ఏపీ పొలీసులు రావొచ్చన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్ను అడ్డుకోవడానికి కేటీఆర్ ఎవరంటూ ధ్వజమెత్తారు సినీనటుడు శివాజీ. 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ పని ఇదీ: డేటా చోరీపై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు